మన దేశంలో పర్యావరణ అనుకూలమైన ఇంధన వనరులకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్ డీజిల్ కు బదులుగా, ఎలక్ట్రిక్, సీఎన్జీ వంటి వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇవి పెట్రోల్, డిజీల్ కు ప్రత్యామ్నాయాన్ని ఇవ్వడంతో పాటు పర్యావరణ అనుకూలమైనవి. అంతేకాక తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. మరోవైపు ఈ సీఎన్జీ, ఎల్పీజీ కార్ల ఇన్సురెన్స్ విషయంలో కూడా ప్రత్యేకమైన అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాల మాదిరిగా వీటి బీమీ కవరేజ్ ఉండదు. ఈ నేపథ్యంలో సీఎన్జీ లేదా ఎల్పీజీ కారుకు ఇన్సురెన్స్ తీసుకునే ముందు పరిశీలించాల్సి అంశాలు, వాటి ప్రయోజనాల వంటి కీలక అంశాలను మీకు అందిస్తున్నాం.
మన దేశంలో సీఎన్జీ లేదా ఎల్పీజీ కారుకు బీమా చేసేటప్పుడు, అనేక రకాల కవరేజీలు మనకు అందుబాటులో ఉంటాయి. అవి థర్డ్ పార్టీ బీమా, కాంప్రిహెన్సివ్ బీమా, ఓన్ డ్యామేజ్(ఓడీ) బీమా. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తప్పనిసరి: భారతదేశంలో మోటారు వాహన చట్టం, 1988 ప్రకారం థర్డ్-పార్టీ లయబిలిటీ బీమా తప్పనిసరి. ఇది ప్రమాదంలో మూడో పక్షాలకు కలిగే నష్టాలు లేదా గాయాలను కవర్ చేస్తుంది.
ప్రాథమిక రక్షణ: ఈ బీమా ప్రాథమిక రక్షణను అందిస్తుంది కానీ మీ వాహనానికి లేదా డ్రైవర్కు జరిగిన గాయానికి సంబంధించిన నష్టాలను కవర్ చేయదు.
పూర్తి కవరేజ్: ప్రమాదాలు, దొంగతనం, అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ కారుకు థర్డ్-పార్టీ బాధ్యతలు, నష్టాలు రెండింటినీ సమగ్ర బీమా కవర్ చేస్తుంది.
సీఎన్జీ, ఎల్పీజీ కిట్ : సీఎన్జీ లేదా ఎల్పీజీ వాహనాల్లో సంబంధిత భాగాల కోసం పాలసీ స్పష్టంగా కవరేజీని కలిగి ఉందని నిర్ధారించుకోండి. దీనికి అదనపు ప్రీమియం అవసరం కావచ్చు. కానీ పూర్తి రక్షణ కోసం ఇది అవసరం.
ఆత్మ రక్షణ: ఓన్ డ్యామేజ్ ఇన్సురెన్స్ అనేది ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ కారుకు జరిగే నష్టాలను కవర్ చేస్తుంది. కారులో మీ పెట్టుబడిని రక్షించడానికి ఇది చాలా కీలకం.
యాడ్-ఆన్ కవరేజ్: మెరుగైన రక్షణ కోసం తరుగుదల కవర్, ఇంజిన్ ప్రొటెక్షన్, రోడ్సైడ్ అసిస్టెన్స్ వంటి యాడ్-ఆన్లను పరిగణించండి.
సీఎన్జీ, ఎల్పీజీ కార్లకు ఇన్సూరెన్స్ చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..