Citroen Basalt: ఆ నయా సిట్రియోన్ కారుకు ఆ రెండు కార్ల నుంచి గట్టి పోటీ.. ది బెస్ట్ కారు ఏదంటే..?

|

Aug 13, 2024 | 4:00 PM

భారతదేశం ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బడ్జెట్ ఎస్‌యూవీలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పది లక్షలలోపు ఎస్‌యూవీలను ప్రజలు అధికంగా ఇష్టపడడంతో చాలా కంపెనీలు తక్కువ ధరలోనే ఎస్‌యూవీలను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈ ఎస్‌యూవీల్లో మోడల్ నుంచి మోడల్‌కు అనుగుణంగా ఫీచర్లు మారుతూ ఉంటాయి. తాజాగా ఇటీవల విడుదలైన సిట్రోయోన్ బసాల్ట్‌కు ప్రధానంగా మూడు కార్లు గట్టి పోటీనిస్తున్నాయి.

Citroen Basalt: ఆ నయా సిట్రియోన్ కారుకు ఆ  రెండు కార్ల నుంచి గట్టి పోటీ.. ది బెస్ట్ కారు ఏదంటే..?
Citroen Basalt
Follow us on

భారతదేశం ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బడ్జెట్ ఎస్‌యూవీలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పది లక్షలలోపు ఎస్‌యూవీలను ప్రజలు అధికంగా ఇష్టపడడంతో చాలా కంపెనీలు తక్కువ ధరలోనే ఎస్‌యూవీలను లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈ ఎస్‌యూవీల్లో మోడల్ నుంచి మోడల్‌కు అనుగుణంగా ఫీచర్లు మారుతూ ఉంటాయి. తాజాగా ఇటీవల విడుదలైన సిట్రోయోన్ బసాల్ట్‌కు ప్రధానంగా రెండు కార్లు గట్టి పోటీనిస్తున్నాయి. సిట్రోయెన్ బసాల్ట్ ఇటీవల ధర రూ. 7.99 లక్షలు ఎక్స్-షోరూమ్. బుక్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చింది.  కేవలం రూ. 11,001 కట్టి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. అక్టోబరు 31 మధ్య బుకింగ్స్ చేసే కస్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో సిట్రోయోన్ బసాల్ట్ గట్టి పోటినిచ్చే కార్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

సిట్రోయెన్ బసాల్ట్

సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీ 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్‌తో 80 బీహెచ్‌పీ శక్తిని, 115 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 109 బీహెచ్‌పీ శక్తిని, 190ఎన్ఎం మాన్యువల్, ఆటోమేటిక్ కోసం 205ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 18 కిలో మీటర్ల నుంచి నుండి 19.5 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. 10.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో  ఆకట్టుకుంటుంది. ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన రియర్ విజన్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంది.

హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా కారు సిట్రోయెన్ బసాల్ట్‌కు గట్టి పోటిస్తుంది. ఈ కారు 1.5-లీటర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్  ద్వారా 144 ఎన్ఎం టార్క్‌ను 113.42 బీహఎచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ 157.57 బీహెచ్‌పీ శక్తిని, 253 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్, 2.5-లీటర్ డీజిల్ మోటారు 144 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారు  పెట్రోల్‌ వెర్షన్ 17 కిమీ డీజిల్‌ వెర్షన్ 21 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఆల్-బ్లాక్ థీమ్ నుంచి హై-క్వాలిటీ మెటీరియల్స్, లెథెరెట్ అప్హోల్స్టరీ ఆకట్టుకుంటుంది. లైవ్ లొకేషన్ షేరింగ్, వైర్‌లెస్ ఛార్జర్, వాయిస్-ఎనేబుల్ స్మార్ట్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు ప్రీ-లోడెడ్ మ్యాప్‌లతో కూడిన 10.25-అంగుళాల టచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కారుకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

కియా సెల్టోస్ 

కియా సెల్టోస్ కారు 1.5 లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్‌ వేరియంట్ ఇంజిన్లతో అందుబాటులో ఉంటుంది. వేరియంట్‌ను బట్టి సెల్టోస్‌లో 17 కిలో మీటర్ల నుంచి 20.3 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. సెల్టోస్ టాప్-ఎండ్ వేరియంట్‌ల కోసం 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌తో పాటు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి రిచ్ ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లతో కూడిన ప్రీమియం క్యాబిన్‌ ఆకర్షిస్తుంది. ఈ కారు క్యాబిన్‌లో 7.0-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, 360-డిగ్రీ కెమెరా, అన్ని ఆటోమేటిక్ వేరియంట్‌లలో స్విచ్ చేసేలా డ్రైవ్ మోడ్‌లు ఆకట్టుకుంటున్నాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..