Government Apps: ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఉంటే ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లాల్సిన పనే లేదు.. ఇంటి నుంచే క్షణాల్లోనే సేవలు..

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనే లేదు. మీకు ఏ సేవ కావాలన్నా మొబైల్ నుంచే సులువుగా పొందే అవకాశముంది. ఇందుకోసం అనేక యాప్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ యాప్స్ ద్వారా మీరు సులువుగా ఏ ప్రభుత్వ పత్రమైనా పొందవచ్చు.

Government Apps: ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఉంటే ఏ ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లాల్సిన పనే లేదు.. ఇంటి నుంచే క్షణాల్లోనే సేవలు..
Bhim

Updated on: Aug 26, 2026 | 4:36 PM

ప్రభుత్వ డాక్యుమెంట్స్ కావాలంటే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే కాలం పోయింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే అన్నీ ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏ సేవలు కావాలన్నా మొబైల్ నుంచే సులువుగా పొందవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు పోర్టల్స్, యాప్‌లు ప్రవేశపెట్టాయి. మీకు ఏ గర్తింపు ధృవీకరణ పత్రం కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లాంటి డాక్యుమెంట్స్ ఇంటి వద్ద ఉండే పొందవచ్చు. ఇందుకోసం అనేక యాప్‌లను కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రతీఒక్కరి దగ్గర ఈ యాప్స్ ఉండటం వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

డిజిలాకర్, ఉమాంగ్ తప్పనిసరి

ప్రతీఒక్కరి మొబైల్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్ డిజిలాకర్. మీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆర్‌సీ, విద్యార్హతకు సంబంధించిన పత్రాలను ఇందులో డిజిటల్‌గా భద్రపర్చుకోవచ్చు. మీకు అవసరమైనప్పుడు వెంటనే ఉపయోగించుకోవచ్చు. ఇక ఉమాంగ్ యాప్ కూడా ప్రతీఒక్కరి ఫోన్‌లో ఉండాలి. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, గ్యాస్ సిలిండర్ బుకింగ్, కరెంట్ బిల్ పే చేయడం వంటి సేవలు దీని ద్వారా పొందవచ్చు. ఇక ఈ-కోర్ట్స్ యాప్ ద్వారా మీకు సంబంధించి కేసులు, వాటి హిస్టరీ, స్టేటస్, తదుపరి విచారణ తేదీలు వంటివి తెలుసుకోవచ్చు. ఇక విద్యార్థులకు స్వయం యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో స్కూల్ స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచితంగా ఆన్ లైన్ కోర్సులు నేర్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

భీమ్ యాప్ ద్వారా యూపీఐ చెల్లింపులు

ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందని భీమ్ యాప్ ప్రతీఒక్కరి ఫోన్లలో తప్పనిసరిగా ఉండాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా సురక్షితంగా యూపీఐ పేమెంట్స్ సులువుగా చేసుకోవచ్చు. అలాగే విద్యుత్ బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు లాంటి అన్నీ సేవలు పొందవచ్చు. అలాగే ఎం పరివాహన్ యాప్ ద్వారా వర్చువల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. అలాగే సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసేముందు ఓనర్ వివరాలు తెలుసుకోవడం, ఈ చలాన్లు చెల్లించడం, ఆర్బీ పొందేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది. అలాగే ఆరోగ్య సేతు యాప్ కూడా ప్రతీఒక్కరిలో ఫోన్లలో ఉండాల్సిన అవసరముంది. సమీపంలోని ప్రభుత్వ హెల్త్ సెంటర్ల సమాచారం తెలుసుకోవడంతో పాటు ఆరోగ్య సమాచారం పొందవచ్చు. అలాగే హెల్త్ ఐటీ క్రియేట్ చేసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us