SIM Cards: సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ వచ్చేశాయి.. ఆ లిమిట్ దాటి..
మొబైల్స్ వాడే ప్రతీఒక్కరికీ అలర్ట్. ఇక నుంచి మీరు ఎన్ని కావాలంటే అన్ని సిమ్‌లు తీసుకోలేరు. కేంద్ర ప్రభుత్వం ఒక పరిమితి విధించింది. ఆ లిమిట్ వరకు మాత్రమే మీరు మొబైల్ కనెక్షన్లు తీసుకోవచ్చు. ఆగస్ట్ 24వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి.

మీరు కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఆగస్ట్ 24వ తేదీ నుంచి రూల్స్ అన్నీ మారాయి. మీరు కొత్త సిమ్ తీసుకోవాలని అనుకుంటుంటే ఈ నిబంధనల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇక నుంచి ఒక వ్యక్తి 9 సిమ్‌లు మాత్రమే కలిగి ఉండటానికి వీలుంటుంది. అంతకంటే ఎక్కువ సిమ్‌లను తీసుకోవాలన్నా కుదరదు. ఆ లిమిట్ దాటితే టెలికాం కంపెనీలు మీకు సిమ్‌లను జారీ చేయవు. ఈ మేరకు ఒక వ్యక్తి ఎన్ని సిమ్‌లు కలిగి ఉండాలనే దానిపై కేంద్రం టెలికమ్యూనికేషన్ల శాఖ పరిమితులు విధించింది. మొబైల్ కనెక్షన్లలో చోటుచేసుకుంటున్న దుర్వినియోగాన్ని అరికట్టడం, అలాగే తమ పేరుపై ఉన్న సిమ్ కార్డులను ప్రజలు సులువుగా గుర్తించేలా చేయడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
గరిష్టంగా తొమ్మిది సిమ్స్
ఆగస్ట్ 24 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రాగా.. ఇక నుంచి ఒక వ్యక్తి ఇప్పటికే తొమ్మిది సిమ్‌లు కలిగి ఉంటే.. కొత్త సిమ్‌లు ఇక పొందలేరు. ఇక గరిష్టంగా తొమ్మిది సిమ్‌ల వరకు ఒక వినియోగదారుడు తీసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలలో ఈ పరిమితి తక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లోని వ్యక్తులు 6 సిమ్ కార్డుల వరకు కలిగి ఉండవచ్చు. ఇక మిగతా రాష్ట్రాల్లోని ప్రజలు గరిష్టంగా తొమ్మిది తీసుకోవచ్చు. దీంతో మీరు కొత్త సిమ్ తీసుకోవాలని అనుకుంటుంటే.. మీ పేరుపై ఎన్ని కనెక్షన్లు ఉన్నాయనేది తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంచార్ సౌథీ యాప్, లేదా పోర్టల్ ద్వారా మీరు తనిఖీ చేసుకోవచ్చు.
మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి..?
-సంచార్ సౌథీ వెబ్‌సైట్లోకి వెళ్లాలి
-హోం పేజీలో కనిపించే ‘Know Mobile Connections in Your Name’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి
-మీ మొబైల్ నెంబర్ ఎంచుకోవాలి
-క్యాప్చా ఎంటర్ చేయాలి
-మొబైల్ నెంబర్‌కుక వచ్చే ఓటీపీని నమోదు చేయాలి
-అక్కడ మీ పేరుపై ఉండే మొబైల్ నెంబర్లను చూడవచ్చు
ఎలా ఫిర్యాదు చేయాలి..?
ఒకవేళ మీకు తెలియకుండా మీ పేరుపై సిమ్ ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. మీకు తెలియని ఫోన్ నెంబర్ పక్కన ఉండే చెక్‌బాక్స్‌ను ఉపయోగించి సంబంధిత నంబర్‌ను ఎంచుకోవాలి. అనంతరం రిపోర్ట్‌పై క్లిక్ చేసి సమర్పించండి. ఆ తర్వాత కనెక్షన్ అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకుని, తదనంతరం డిస్‌కనెక్ట్ చేయబడవచ్చు. అధికారులు పరిశీలించి మీ పేరుపై లేని సిమ్ నెంబర్‌ను తొలగిస్తారు. దీని వల్ల మీకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.
