AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPDO: మీ పీఎఫ్ అకౌంట్ బ్లాక్ అయిందా..? జస్ట్ ఇదొక్కటి క్లిక్ చేస్తే చాలు..సెకన్లలోనే యాక్టివ్ అవుతుంది..

మీ పీఎఫ్ అకౌంట్ బ్లాక్ అయిందా.. లేదా లాగిన్ అవ్వడంలో ఏమైనా సమస్యలు వస్తున్నాయా.. అయితే మీరు సులువుగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అనేక మార్గాలు ఉన్నాయి. ఇక కేవైసీ సంబంధిత సమస్యలను ఎదురైనా ఎలా పరిష్కరించుకోవాలనేది ఒకసారి చూద్దాం.

EPDO: మీ పీఎఫ్ అకౌంట్ బ్లాక్ అయిందా..? జస్ట్ ఇదొక్కటి క్లిక్ చేస్తే చాలు..సెకన్లలోనే యాక్టివ్ అవుతుంది..
Epfo
Venkatrao Lella
|

Updated on: Aug 26, 2026 | 7:30 AM

Share

దేశంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగి జీతం రూ.15 వేలు ఉంటే ఈ పథకంలో తప్పనిసరిగా చేరాల్సి ఉంటుంది. ఇక రూ.15 వేలుపైన జీతం ఉన్నవారు స్వచ్చంధంగా చేరవచ్చు. అలాగే స్వచ్చంధ ప్రావిడెంట్ ఫండ్(VPF) కూడా ఎంచుకునే వెసులుబాటు అనేది ఉంటుంది. అయితే పీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసేందుకు ఈపీఎఫ్ఓ పోర్టల్ ఉపయోగపడుతుంది. అలాగే ఉమాంగ్ యాప్‌లో కూడా సేవలు పొందవచ్చు. మీ పీఎఫ్ అకౌంట్ బ్లాక్ చేయబడ్డా, యూఏఎన్ పాస్ట్ వర్డ్ మర్చిపోయినా, పాస్ బుక్ యాక్సెస్ చేయలేకపోయినా, కేవైసీ పెండింగ్‌లో ఉన్నా లేదా రిజెక్ట్ చేసినా సులువుగా చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓ అకౌంట్ బ్లాక్ అయిందా..?

ఈపీఎఫ్ఓ అకౌంట్ బ్లాక్ అయితే ఏం చేయాలనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు. పదే పదే లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు విఫలమైతే బ్లాక్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోకి వెళ్లి సైన్ ఇన్ బటన్ కింద ఉండే అన్ లాక్ అకౌంట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ కనిపించకపోతే పేజీని రిఫ్రెష్ చేయాలి లేదా 30 నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించాలి. ఈ విధానంలో బ్లాక్ అయిన అకౌంట్‌ను తిరిగి యాక్సెస్ చేయవచ్చు. ఇక పీఎఫ్ అకౌంట్ రిస్ట్రిక్టెడ్ అవుతూ ఉంటుంది. అకౌంట్లో ఈ నామినీ వివరాలను అప్డేట్ చేయకపోతే ఇది జరగవచ్చు. నామినేషన్ వివరాలను అప్డేట్ చేయకుండా కనీసం ఐదుసార్లు లాగిన్ అయితే ఇలాంటి సమస్య వస్తుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ హోమ్ పేజీలోని లాగిన్ అయ్యి మేనేజ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని ఈనామినేషన్ ఫైల్ చేయండి.

వివరాలు అప్డేట్ చేసుకోవడం

ఇక మీ వివరాల్లో తేడా ఉన్నప్పుడు ఎర్రర్ మెస్సేజ్ వస్తుంది. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగం వంటి వివరాలు ఆధార్‌తో సరిపోలకపోతే ఈ సమస్య వస్తుంది. ఇలాంటి సమయంలో మీరు క్లెయిమ్ దాఖలు చేయలేరు. ఇందుకోసం మీరు మేనేజ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని ‘Modify Basic Details’ ను ఎంచుకోండి. అనంతరం సరైన వివరాలు నమోదు చేసి యజమాని ఆమోదం కోసం వేచి ఉండండి.  ఇక మీరు మీ EPF పాస్‌బుక్‌ను యాక్సెస్ చేయలేకపోయినా లేదా అది లోడ్ కాకపోతే మళ్లీ ప్రయత్నించండి. అధిక ట్రాఫిక్ కారణంగా ఇది జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో మళ్లీ రీఫ్రెష్ చేయండి. లేకపోతే ఉమాంగ్ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఇలా ఆన్లైన్ ద్వారా మీరు అన్నీ సేవలు పొందవచ్చు.

Follow Us
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!
రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!
క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్
క్రికెట్, హాకీ మ్యాచ్‌లతో చరిత్ర సృష్టించిన భారత్-పాక్
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..
ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..
ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?
మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?