Latest rules: అక్టోబర్ నుంచి ఆ రూల్స్ మార్పు.. తెలుసుకోకుంటే నష్టం తప్పదంతే..!

|

Sep 30, 2024 | 6:01 PM

ప్రజల ప్రయోజనం, సమస్యల పరిష్కారం, ఆర్థిక వ్యవహారాల సులభతరం కోసం ప్రభుత్వం అనేక మార్పులు చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. వీటి వల్ల ఆర్థిక సంబంధ వ్యవహరాలలో స్పల్ప మార్పులు వస్తాయి. వాటిపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. దీనివల్ల ప్రజలకు స్పష్టత రావడంతో పాటు పనులు సులభంగా జరుగుతాయి.

Latest rules: అక్టోబర్ నుంచి ఆ రూల్స్ మార్పు.. తెలుసుకోకుంటే నష్టం తప్పదంతే..!
October 1st Rules
Follow us on

ప్రజల ప్రయోజనం, సమస్యల పరిష్కారం, ఆర్థిక వ్యవహారాల సులభతరం కోసం ప్రభుత్వం అనేక మార్పులు చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. వీటి వల్ల ఆర్థిక సంబంధ వ్యవహరాలలో స్పల్ప మార్పులు వస్తాయి. వాటిపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. దీనివల్ల ప్రజలకు స్పష్టత రావడంతో పాటు పనులు సులభంగా జరుగుతాయి. ఇటీవల ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. వాటికి పార్లమెంట్ ఆమోదం కూడా లభించింది. వాటిని అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే త్రైమాసికంలో అమలు చేయనున్నారు.

కొత్త నిబంధనలు

పార్లమెంట్ లో జూలై 23వ తేదీన యూనియన్ బడ్జెట్ ను ఆమోదించారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ), టీడీఎస్ రేటు, ఆధార్ కార్డు, షేర్ బైబ్యాక్ తదితర విషయాలలో కొన్ని మార్పులు తీసుకువచ్చారు. అలాగే ది వివాద్ సే విశ్వాస్ పథకం 2.0 కూడా అమలు చేయనున్నారు. ఇవన్నీ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ కార్డు

ఆధార్ కార్డు అనేది దేశంలో పౌరులందరికీ గుర్తింపు పత్రం. జీవితంలో ప్రతి రోజూ అనేక పనులకు ఆధార్ కార్డు అవసరం అవుతుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ 12 అంకెల నంబర్ కేటాయిస్తారు. వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ నంబర్ కీలకంగా ఉంటుంది. అయితే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో మనకు ఎన్ రోల్ మెంట్ ఐడీ ఇస్తారు. దీని ద్వారా మన ఆధార్ కార్డు స్టేటస్ ను తనిఖీ చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఆధార్ కార్డు ఇంకా రానివారు ఎన్ రోల్ మెంట్ ఐడీ నంబర్ ను వివిధ అవసరాలకు నమోదు చేసేవారు. అక్టోబర్ ఒకటి నుంచి ఇలా చేయడం కుదరదు. తప్పనిసరిగా ఆధార్ కార్డు నంబర్ కావాల్సిందే. పాన్ కార్డు దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

ఎస్ టీటీ

ఈక్విటీ షేర్లు, ఫ్యూచర్లు, ఆప్షన్లలో సహా వివిధ సెక్యూరీటీలను కొనుగోలు చేసినప్పుడు, అమ్మకం జరిపినప్పుడు ఎస్ టీటీ పన్నును విధిస్తారు. దీన్ని 0.02 శాతం, 0.1 శాతానికి పెంచాలని యూనియన్ బడ్జెట్ లో నిర్ణయించారు. ఈ నిబంధన అక్టోబర్ ఒకటి నుంచి అమలవుతుంది. 

ప్రభుత్వ బాండ్లపై టీడీఎస్ రేటు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన బాండ్లతో పాటు ప్లోటింగ్ బాండ్లపై మూలధనం వద్ద మినహాయించిన పన్ను (టీడీఎస్) ను వసూలు చేయనున్నారు. ఈ బాండ్లకు పది శాతం టీడీఎస్ వర్తిస్తుంది. ఇది కూడా అక్టోబర్ ఒకటి నుంచి అమలు కానుంది. 

టీటీఎస్ రేట్లు తగ్గింపు

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్లు 19 డీఏ (జీవిత బీమా పాలసీ చెల్లింపు), 194 హెచ్ (బ్రోకరేజ్ కమీషన్), 194-ఐబీ (వ్యక్తి, హెచ్ యూఎఫ్ ద్వారా అద్దె చెల్లింపు), 194 ఎం (వ్యక్తి, హెచ్ యూఎఫ్ ద్వారా కొన్నిచెల్లింపులు) కింద చెల్లింపులకు టీడీఎస్ రేట్లను తగ్గించారు. ఇవి 5 శాతం నుంచి రెండు శాతానికి తగ్గాయి. అలాగే ఇ-కామర్స్ ఆపరేటర్లకు టీడీఎస్ రేటును 1 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గించారు.

వివాద్ సే విశ్వాస్ 2.0

ఆదాయపు పన్ను వివాదాల పరిష్కారం కోసం వివాద్ సే విశ్వాస్ 2.0 ను ప్రవేశపెట్టారు. యూనియన్ బడ్జెట్ లోనే దీనికి కూడా ఆమోదం లభించింది. అక్టోబర్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ప్రత్యక్ష పన్నుల కింద కేసుల పరిష్కారం కోసం మొదటి వివాద్ సే విశ్వాస్ పథకాన్ని 2020లో ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ద్వారా సుమారు ఒక లక్షమంది పన్ను చెల్లింపుదారులు పరిష్కారం పొందారు. ప్రభుత్వానికి దాదాపు రూ.75 వేల కోట్లు వచ్చాయి. దీనికి కొనసాగింపుగా అక్టోబర్ ఒకటి నుంచి 2.0ను అమలు చేయనున్నారు.

షేర్ బైబ్యాక్

షేర్ బైబ్యాక్ పై కొత్ పన్ను నిబంధనలు అమలు కానున్నాయి. వాటాదారులపై కంపెనీలు పన్నుభారాన్ని మోపుతాయి. ప్రస్తుతం వివిధ కంపెనీలు బైబ్యాక్ లపై 20 శాతం పన్ను చెల్లిస్తున్నాయి. పెట్టబడిదారులకు అదనపు పన్ను లేదు. అయితే కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు పన్నులను తీసివేయవు. ఇన్వెస్టర్ల ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం డివెండెంట్లుగా పన్ను విధిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..