స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

| Edited By:

Jul 03, 2019 | 5:11 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడంతో పాటు.. శుక్రవారం రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రారంభంలో 200 పాయింట్ల వరకు ఎగబాకిన సెన్సెక్స్‌ కొద్ది క్షణాలకే ఆ లాభాలను కోల్పోయింది. నిఫ్టీ కూడా ఇవాళ ఫ్లాట్‌గా మొదలైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ స్వల్పంగా 23 పాయింట్లు లాభపడి 39,839 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,917 వద్ద స్థిరపడ్డాయి.

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us on