Business Ideas: సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ ఇదే.. నెలకు రూ.లక్ష ఆదాయం.. ఒక్కసారి స్టార్ట్ చేస్తే డబ్బులే.. డబ్బులు

సమ్మర్‌లో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా.. ఎలాంటి బిజినెస్ మొదలుపెట్టారో మీకు అర్థం కావడం లేదా.. ఏది స్టార్ట్ చేస్తే వెంటనే లాభాలు వస్తాయనేది అర్థం కావడం లేదా.. అయితే మీరు బుర్ర బద్దలు కొట్టుకోకండి. సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ టిప్స్ ఇక్కడ చూద్దాం.

Business Ideas: సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ ఇదే.. నెలకు రూ.లక్ష ఆదాయం.. ఒక్కసారి స్టార్ట్ చేస్తే డబ్బులే.. డబ్బులు
Business Tips

Updated on: Mar 17, 2026 | 12:43 PM

దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నుంచే భానుడు తన తీవ్రత చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతుండగా.. రానున్న మూడు నెలల పాటు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశముంది. అయితే ఎండ ప్రభావం క్రమంలో ప్రజలు శీతల పానియాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎండ వేడి నుంచి చల్లదనం కోసం శీతల పానియాలను తీసుకుంటున్నారు. దీంతో వీటి కోసం ఉపయోగించే ఐస్‌కు డిమాండ్ పెరిగిపోయింది. సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ ఏదైనా ఉందంటే. అది ఐస్ క్యూబ్స్ తయారీ బిజినెస్. ఇప్పుడు మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు లక్షల్లోనే ఆదాయం పొందవచ్చు. అసలు ఈ వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి..? ఎంతవరకు ఖర్చు అవుతుంది..? అనే విషయాలు చూద్దాం.

ఎలా స్టార్ట్ చేయాలి..?

మీరు ఈ వ్యాపారాన్ని మీ ఇంటి వద్దనే స్టార్ట్ చేయవచ్చు. పంక్షన్లకు డెలివరీ చేయవచ్చు. అలాగే షాపులు, జ్యూస్ దుకాణాలు, ఐస్ క్రీం, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటికి విక్రయించి ఆదాయం పొందవచ్చు. మీరు మార్కెటింగ్ చేసుకుంటే లక్షల్లోనే ఆదాయం వస్తుంది. ముందుగా వ్యాపారం స్టార్ట్ చేయడానికి లైసెన్స్, స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. లక్ష రూపాయల పెట్టుబడి మీకు అవసరమవుతుంది. ఆకర్షణీయమైన డిజైన్లతో ఐస్ క్యూబ్స్ తయారుచేస్తే కస్టమర్లు మరింత ఆకర్షితులు అవుతారు.

ఇవి అవసరం

ఫ్రీజర్, విద్యుత్, నీరు అవసరం. డీప్ ఫ్రీజర్ రూ.50 వేలు పడుతుంది. ఇక ఇతర పరికరాలు మరో రూ.50 వేల వరకు ఉంటాయి. ఇక తయారుచేసే ముందు మీ ప్రాంతంలో డిమాండ్ ఉందా.. లేదా అనేది చూసుకోండి. చుట్టుపక్కల ప్రాంతాల్లో షాపులు ఉన్నాయా.. లేదా. అనేది చెక్ చేసుకోండి. ఇక లాభాలు ఎలా ఉంటాయనేది కూడా అంచనా వేసుకోండి.

ఎంతవరకు ఆదాయం పొందవచ్చు

మీరు రూ.లక్ష పెట్టుబడితో ఐస్ క్యూబ్స్ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలనెలా రూ.30 వేల వరకు పొందవచ్చు. ఇక ఎక్కువ దుకాణాలకు సరఫరా చేస్తే రూ.50 వేల వరకు సంపాదించవచ్చు. ఇక మీ బిజినెస్‌ను ప్రమోట్ చేసుకుంటే సమీపంలోని దుకాణాల యజమానులకు తెలుస్తుంది. దీని వల్ల మీ ఫ్యాక్టరీకే వచ్చి ఐస్ క్యూబ్స్ కొనుగోలు చేస్తారు. మీరు ఎన్ని ఎక్కువ షాపులకు ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తే అంత లాభం పొందవచ్చు. రూ.లక్ష కూడా సంపాదించుకునే వీలు ఉంటుంది. వేసవికాలంలో బాగా డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత కాస్త డిమాండ్ తగ్గుతుంది. రిస్క్ లేని బిజినెస్‌గా దీనిని చెప్పవచ్చు. చిన్న వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

Follow Us