మీ ఊరు, వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా..? లేదా..? ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్.. సింపుల్ ప్రాసెస్ ఇదే..
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల పలు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా చాలమంది ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో మీ ఊరు, వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ఓటర్ ఐడీ అనేది దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీఒక్కరికీ ఖచ్చితంగా ఉండాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్. కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడానికే కాదు.. ఒక ప్రధానమైన గుర్తింపు పత్రంగానే ఇది మీకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం, ప్రైవేట్ సేవలు పొందేందుకు అధికారిక గుర్తింపు పత్రంగా సహాయపడుతుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటివి మీ వద్ద లేనప్పుడు ఓటర్ ఐడీని మీ వివరాల ధృవీకరణ కోసం అందించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక సేవలకు ఓటర్ ఓడీని గుర్తింపు పత్రంగా అనుమతిస్తున్నాయి. దీంతో ఓటర్ ఐడీ కలిగి ఉండటమే కాకుండా.. అందులో వివరాలు తప్పులు లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఎస్‌ఐఆర్ తర్వాత మీ పేరు ఉందా..? లేదా..?
ఇటీవల చాలా రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ జరగ్గా.. చాలామంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురి పేర్లను తొలగించింది. దీంతో మీ ఊరు లేదా వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా..లేదా అనేది చూసుకోవడం ముఖ్యం. ఓటర్ల లిస్టు నుంచి పేర్లను తొలగించినవారికి ఈసీ అవకాశం కల్పించింది. వారి తమ ఆధారాలను సమర్పించడానికి మరో ఛాన్స్ ఇచ్చింది. అలాంటివారు తమ ఆధారాలను సమర్పిస్తే మళ్లీ ఓటర్ల జాబితాలో పేర్లను చేరుస్తారు. అసలు మీరు ఓటర్ల జాబితాలో ఉందో.. లేదో ఎలా తెలుసుకోవాలనేది చేద్దాం.
మీ ఊరు, వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు చూసుకోండిలా..
-కేంద్ర ఎన్నికల సంఘం సిటిజన్ సర్వీస్ పోర్టల్‌కు వెళ్లండి
-హోమ్ పేజీలో పైన డౌన్‌లోడ్ ఎలక్ట్రోరల్ రోల్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
-అనంతరం వేరే పేజీ తెరుచుకుంటుంది
-అక్కడ మీ స్టేట్, ఇయర్, ఎస్‌ఐఆర్ డ్రాఫ్ట్ రోల్-2026, జిల్లా, మీ నియోజకవర్గం, బాష, క్యాప్చా నమోదు చేయండి
-ఆ తర్వాత కింద కనిపించే జాబితాలో మీ పోలింగ్ బూత్ పేరును ఎంచుకోండి
-అనంతరం పైన మీరు వివరాలు నమోదు చేసిన చోట కనిపించే డౌన్‌లోడ్ సెలక్టెడ్ పీడీఎఫ్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-ఆ తర్వాత మీ సిస్టమ్ పీడీఎఫ్ రూపంలో ఓటర్ల జాబితా డౌన్‌లోడ్ అవువుతుంది
-ఆ ఫైల్ ఓపెన్ చేసి జాబితాలో మీ పేరు ఉందో.. లేదో చూసుకోండి..
పేరు లేకపోతే ఏం చేయాలి..?
మీ బూత్ లెవల్ ఆఫీసర్ నెంబర్ ఈసీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుంది. వారికి కాల్ చేసి మరింత సమాచారం పొందవచ్చు. సమస్య ఏంటనేది తెలుసుకుని పరిష్కరించుకుంటే సరిపోతుంది. ఓటర్ల జాబితాలో మీ పేరు తిరిగి మళ్లీ వచ్చే అవకాశముంది.
