Gold Selling: పాత బంగారం అమ్మేటప్పుడు కొన్న ధర కంటే తక్కువ ఎందుకు వస్తుంది? ప్రధాన కారణాలు ఇవే!

Gold Selling: పాత ఆభరణాలను కరిగించే క్రమంలో స్వల్పంగా బరువు తగ్గడం సహజం. దీనితో పాటు జ్యువెలర్లు బంగారాన్ని రీఫైన్ చేయడానికి లేదా టెస్టింగ్ ఛార్జీల కింద 2% నుండి 5% వరకు మార్జిన్ కోత విధిస్తారు. పాత బంగారం అమ్మేటప్పుడు నష్టపోకుండా ఉండాలంటే..

Gold Selling: పాత బంగారం అమ్మేటప్పుడు కొన్న ధర కంటే తక్కువ ఎందుకు వస్తుంది? ప్రధాన కారణాలు ఇవే!
Gold Selling

Updated on: Aug 19, 2026 | 6:00 AM

Gold Selling: పాత బంగారాన్ని విక్రయించేటప్పుడు కొనుగోలు చేసిన నాటి ధరలతో పోలిస్తే లేదా ప్రస్తుత మార్కెట్ రేటు కంటే తక్కువ మొత్తం రావడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ, ఆభరణాలను తిరిగి అమ్మేటప్పుడు ఆశించిన లాభం రాకపోవడానికి వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

1. తయారీ కూలీ, తరుగు

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారులు డిజైన్‌ను బట్టి 8% నుండి 25% వరకు తయారీ మేకింగ్‌ ఛార్జీలను, అలాగే తరుగు రూపంలో వసూలు చేస్తారు. అయితే పాత బంగారాన్ని తిరిగి అమ్మేటప్పుడు జ్యువెలర్లు కేవలం అందులోని స్వచ్ఛమైన బంగారం బరువుకు మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. తయారీ కూలీ, తరుగును పూర్తిగా మినహాయిస్తారు.

2. జీఎస్టీ, పన్నులు

ఆభరణాలు కొనే సమయంలో చెల్లించిన 3% జీఎస్టీ, ఇతర పన్నులను తిరిగి అమ్మే సమయంలో క్లెయిమ్ చేయలేరు. ఈ పన్నుల మొత్తం ప్రభుత్వానికి చేరుతుంది. అందుకే రీసేల్ విలువలో ఇది తిరిగి లభించదు.

ఇవి కూడా చదవండి

3. రాళ్ళు, ఇతర అలంకరణల బరువు తగ్గించడం

నగలలో ఉన్న రాళ్ళు, ముత్యాలు, కుందన్లు లేదా ఎనామెల్ వర్క్ బరువును అమ్మకపు సమయంలో మొత్తం బరువు నుండి మినహాయిస్తారు. కొనుగోలు చేసేటప్పుడు రాళ్ళతో కలిపి బరువు వేసినప్పటికీ, అమ్మేటప్పుడు మాత్రం కేవలం బంగారానికి మాత్రమే విలువ కడతారు.

4. బంగారం స్వచ్ఛత, క్యారెట్ వ్యత్యాసం

పాత బంగారంలో స్వచ్ఛతను (Purity) కేరటోమీటర్ ద్వారా పరీక్షించినప్పుడు, అది 22 క్యారెట్ల కంటే తక్కువ స్వచ్ఛత కలిగి ఉందని తేలితే ఆ నిష్పత్తి ప్రకారం ధర తగ్గిస్తారు. ముఖ్యంగా నాన్-హాల్‌మార్క్ ఆభరణాల విషయంలో ఈ కోత మరింత ఎక్కువగా ఉంటుంది.

5. మెల్టింగ్ లాస్ మరియు హ్యాండ్లింగ్ ఛార్జీలు

పాత ఆభరణాలను కరిగించే క్రమంలో స్వల్పంగా బరువు తగ్గడం సహజం. దీనితో పాటు జ్యువెలర్లు బంగారాన్ని రీఫైన్ చేయడానికి లేదా టెస్టింగ్ ఛార్జీల కింద 2% నుండి 5% వరకు మార్జిన్ కోత విధిస్తారు. పాత బంగారం అమ్మేటప్పుడు నష్టపోకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ BIS హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలనే కొనుగోలు చేయడం శ్రేయస్కరం. అలాగే విక్రయించే ముందు వేర్వేరు గుర్తింపు పొందిన నగల దుకాణాల్లో స్వచ్ఛతను పరీక్షించి, నాటి ప్రత్యక్ష మార్కెట్ ధరను సరిచూసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us