Vehicle Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుందో తెలుసా?
Vehicle Insurance: ప్రస్తుతం రెండు రకాల వాహన బీమా పాలసీలు అమలులో ఉన్నాయి: థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ (ఓన్ డామేజ్) ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ బీమాపై అవగాహన లేక చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు..

Vehicle Insurance: వాహన బీమా నిబంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు రవాణా శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. త్వరలో పోలీసులు, ఆర్టీఏ అధికారులు దేశవ్యాప్తంగా వాహన తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. ముఖ్యంగా థర్డ్ పార్టీ బీమా లేకుండా రోడ్లపై తిరుగుతున్న కోట్లాది వాహనాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలను సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించి, ఆటోమేటిక్ ఈ-చలాన్లు జారీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టమైన సూచనలను జారీ చేసింది.
దేశంలో వ్యక్తిగత, వాణిజ్య వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. లక్షల సంఖ్యలో టూ-వీలర్లు, కార్లు రోడ్లపైకి వస్తున్నాయి. అయితే, రవాణా శాఖ తనిఖీల్లో ఆందోళనకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. చాలా టూ-వీలర్లు, కొన్ని ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు బీమా లేదని అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక భద్రత కల్పించడంలో థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ, దేశంలో 56 శాతం వాహనాలు బీమా లేకుండానే తిరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో తగిన పరిహారం అందడం లేదని సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Ratan TATA: రతన్ టాటా ప్రేమకథ, పెళ్లి ఎందుకు చేసుకోలేకపోయారు? పూర్తి వివరాలు
ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థలు సమర్థవంతంగా గుర్తిస్తున్నాయి. అదే తరహాలో ఈ వ్యవస్థలను వాహన బీమా డేటాబేస్‌తో అనుసంధానం చేసి, బీమా గడువు ముగిసిన వాహనాలకు ఆటోమేటిక్ ఈ-చలాన్లు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు త్వరలోనే వాహన్ పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేస్తామని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.
మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988లోని సెక్షన్ 146 ప్రకారం, ప్రతి వాహనానికి బీమా కవరేజ్ తప్పనిసరి. ఇది ట్రాన్స్‌పోర్ట్ వాహనమైనా, నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనమైనా ఈ నిబంధన వర్తిస్తుంది. వాహనం కొనుగోలు చేసినప్పుడే షోరూమ్‌లలోనే బీమా చేయబడుతున్నప్పటికీ, చాలా మంది పునరుద్ధరణపై శ్రద్ధ చూపడం లేదు. బీమా లేని వారికి మోటార్ వెహికల్స్ యాక్ట్ 196 ప్రకారం రూ. 2000 జరిమానా విధిస్తున్నారు. అంతేకాకుండా, బీమా లేని వాహనాలకు ఇంధనం అందించకుండా “నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్” విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా పరిశీలించాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.
ఇది కూడా చదవండి: House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?
ప్రస్తుతం రెండు రకాల వాహన బీమా పాలసీలు అమలులో ఉన్నాయి: థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, కాంప్రహెన్సివ్ (ఓన్ డామేజ్) ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ బీమాపై అవగాహన లేక చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. థర్డ్ పార్టీ బీమా ఎదుటి వాహనం లేదా వ్యక్తికి జరిగిన నష్టానికి పరిహారం అందిస్తుంది. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అయితే, సొంత వాహనానికి జరిగిన నష్టానికి, ఫ్లడ్స్, ఫైర్ వంటి ఇతర కవరేజీలను కూడా అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Gas Cylinder: మీకు గ్యాస్ సిలిండర్ ఉందా..? మీకో అదిరిపోయే గుడ్‌న్యూస్..!
ఇటీవలి కాలంలో కొత్త వాహనాలకు మూడేళ్ల థర్డ్ పార్టీ బీమాతో పాటు, ఒక సంవత్సరం కాంప్రహెన్సివ్ బీమాను అందిస్తున్నారు. కాంప్రహెన్సివ్ బీమాను ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాలి. కస్టమర్‌లు తమ అవసరాలకు అనుగుణంగా జీరో డిప్రిసియేషన్, కీ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్‌లను ఎంచుకోవడం ద్వారా క్లెయిమ్ సమయంలో 100% పరిహారం పొందవచ్చు. ప్రమాదాలు జరిగి లక్షల రూపాయల ఖర్చు వచ్చినప్పుడు, బీమా లేకపోతే ఆ ఆర్థిక భారాన్ని భరించడం కష్టం. తక్కువ ప్రీమియంతో లభించే బీమా పాలసీలు ఈ భారాన్ని తగ్గిస్తాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అనేక బీమా కంపెనీలు సులభంగా పాలసీలను అందిస్తున్నాయి. క్లెయిమ్‌లను వేగంగా సెటిల్ చేస్తున్నాయి. వాహనదారులు తప్పనిసరిగా బీమా తీసుకోవాలని, లేనిపక్షంలో జరిమానాలతో పాటు వాహనాలు సీజ్ చేయబడతాయని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Gas Cylinder: సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
