
ఓ సామాన్య వ్యక్తి నెలకు రూ. 34 వేలు సంపాదిస్తున్నాడు. మరి అందులో నుంచి ఎంతమేరకు SIP పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందామా.. నెలకు రూ. 8 వేలు SIP రూపంలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితే.. 15 సంవత్సరాల తర్వాత దీర్ఘకాలిక రాబడిని మనం ఏర్పరచుకోవచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఆ పోర్ట్‌ఫోలియోలో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్‌లో రూ. 2000, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్‌లో రూ. 1500, మిరే అసెట్ గోల్డ్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌లో రూ. 1500, జియో బ్లాక్‌రాక్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్‌లో రూ. 1000, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్‌లో రూ. 1000, కోటక్ మల్టీ క్యాప్‌లో రూ. 1000 SIP చేయాలని అంటున్నారు.
ఈ పోర్ట్‌ఫోలియో మల్టీ క్యాప్ విధానాన్ని అనుసరించి, అంతర్లీనంగా ఈక్వల్-వెయిటెడ్ స్ట్రాటజీలా కనిపిస్తుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటాయింపులు కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యంగా(15 సంవత్సరాలు) ఈ పోర్ట్ ఫోలియో అనుకూలంగా ఉంటుంది. ఈ రూ. 8 వేల SIP భవిష్యత్తులో మంచి రాబడి అందిస్తుందని బిజినెస్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మీరు కూడా SIP మొదలు పెట్టాలనుకుంటే.. కచ్చితంగా ముందుగా బిజినెస్ అడ్వైజర్‌ను సంప్రదించాల్సిందే.
ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాదే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి