కస్టమర్లకు జియో మరో ఫ్రీ ఆఫర్..!

| Edited By:

Oct 13, 2019 | 12:02 PM

వినియోగదారులకు జియో మరో ఫ్రీ ఆఫర్ తెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని చెప్పిన రెండ్రోజుల్లోనే.. జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్ ఇవ్వనున్నట్లు జియో సంస్థ ప్రకటించింది. కొత్త రీచార్జ్‌తో వడ్డింపు స్టార్ట్ అవుతుందని భావించిన వినియోగదారులు.. అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో.. తన ఖాతాదారులను కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ప్రకటించింది జియో. జియో తాజా […]

కస్టమర్లకు జియో మరో ఫ్రీ ఆఫర్..!
Follow us on

వినియోగదారులకు జియో మరో ఫ్రీ ఆఫర్ తెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని చెప్పిన రెండ్రోజుల్లోనే.. జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్ ఇవ్వనున్నట్లు జియో సంస్థ ప్రకటించింది. కొత్త రీచార్జ్‌తో వడ్డింపు స్టార్ట్ అవుతుందని భావించిన వినియోగదారులు.. అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో.. తన ఖాతాదారులను కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ప్రకటించింది జియో.

జియో తాజా ప్రకటన ద్వారా.. తొలిసారి రీచార్జ్ చేయించుకునన్న ఖాతాదారులకు 30 నిమిషాల పాటు ఉచిత టాక్‌టైం ఇవ్వనున్నట్టు పేర్కొంది. రీచార్జ్ ప్లాన్ ప్రకటించిన తొలి వారం రోజుల్లో మాత్రమే ఈ వన్‌-టైమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంటే తన నెట్‌వర్క్ పరిధిలో కాల్స్‌కి ఫ్రీ అయినా.. ఇతర నెట్‌వర్క్‌లకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తుండగా.. ఈ 30 నిమిషాల ఫ్రీ టాక్‌ టైం వారికి వర్తింజేయనుంది. అయితే.. ఈ ఆఫర్‌పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.