
Credit Card Payment: చాలామంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు బిల్లు చెల్లించాల్సిన తేదీ (Due Date) మర్చిపోవడం వల్ల లేదా సాంకేతిక కారణాల వల్ల ఒకట్రెండు రోజులు ఆలస్యంగా చెల్లిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులు భారీగా లేట్ ఫీజులు వసూలు చేయడమే కాకుండా, ఆ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు (CIBIL వంటివి) నివేదిస్తాయి. దీనివల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను అమలులోకి తెచ్చింది.
ఇది కూడా చదవండి: New Rules: ఎల్‌పిజి డెలివరీ నుండి ఆన్‌లైన్ గేమింగ్ వరకు.. మే 1 నుంచి మారిన కొత్త నిబంధనలు ఇవే..!
వినియోగదారులకు మెరుగైన రక్షణ కల్పించడం, బ్యాంకులు ఏకపక్షంగా భారీ పెనాల్టీలు వేయకుండా నిరోధించడం కోసం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నచిన్న పొరపాట్ల వల్ల సామాన్యుల క్రెడిట్ చరిత్ర దెబ్బతినకూడదనేది కేంద్ర బ్యాంకు ఉద్దేశ్యం.
జాగ్రత్త: ఈ 3 రోజుల గడువును ఒక అలవాటుగా మార్చుకోకండి. కేవలం అత్యవసర సమయాల్లో లేదా మర్చిపోయినప్పుడు మాత్రమే ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. బ్యాంకులు ఈ నిబంధనలను తమ సిస్టమ్స్‌లో అప్‌డేట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. అందుకే మీ కార్డ్ ఇష్యూయర్ తాజా నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ధరల్లో భారీ విస్ఫోటనం.. తులం ధర రూ.2.54 లక్షలకు చేరే ఛాన్స్? షాకింగ్ నివేదిక!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి