Bank Account: ఈ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. జూన్‌ 30లోగా ఈ పని చేయండి.. లేకుంటే అకౌంట్‌ క్లోజ్‌

|

Jun 26, 2024 | 6:56 PM

చాలా మందికి వివిధ బ్యాంకుల్లో అకౌంట్‌ ఉంటుంది. అయితే కొందరు ఖాతాలు తీసుకున్న తర్వాత బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయరు. అలాగే కేవైసీ కూడా అప్‌డేట్‌ చేసుకోలేరు. అలాంటి ఖాతాలపై సంబంధిత బ్యాంకులు చర్యలు చేపడుతున్నాయి. మీకు కూడా ఈ బ్యాంకులో ఖాతా ఉంటే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే జూన్ 30లోగా ఈ పని చేయకుంటే మీ ఖాతా మూసివేసే అవకాశం ఉంది.

Bank Account: ఈ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. జూన్‌ 30లోగా ఈ పని చేయండి.. లేకుంటే అకౌంట్‌ క్లోజ్‌
Bank Account
Follow us on

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కి చెందిన కోట్లాది మంది ఖాతాదారులకు అలర్ట్‌. ఎందుకంటే ఈ బ్యాంకు ఖాతాదారులకు జూన్‌ 30వ తేదీ సమీపిస్తోంది. అంటే కేవలం మరో నాలుగు రోజులు మాత్రమే ఉందన్నట్లు. మీరు మీ ఇన్‌ఆపరేటివ్ ఖాతాను యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే ఖచ్చితంగా ఈ పనిని జూన్ 30లోగా పూర్తి చేయండి. లేదంటే జూలై 1న కస్టమర్ల ఖాతాలు మూసివేయనుంది. చాలా కాలంగా ఖాతాను ఉపయోగించని కొంతమంది కస్టమర్లకు పీఎన్‌బీ నోటీసులు పంపుతోంది.

మీకు పీఎన్‌బీ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉంటే, ముందుగా దాని స్థితిని తనిఖీ చేయండి. పీఎన్‌బీ ఈ నెలాఖరులోగా జూన్ 30, 2024 వరకు అటువంటి ఖాతాలను మూసివేయబోతోంది. బ్యాంకు తన నోటిఫికేషన్‌లో గత 3 సంవత్సరాలుగా ఎలాంటి లావాదేవీలు జరగని, అలాగే జీరో బ్యాలెన్స్‌ ఉన్న ఖాతాలపై చర్యలు తీసుకోనుంది. అలాంటి వినియోగదారులకు బ్యాంకు ఇప్పటికే నోటీసులు పంపింది. నోటీసు పంపిన ఒక నెల తర్వాత ఆ ఖాతాలు మూసివేయబడతాయి. మీరు ఆ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటే బ్యాంకు శాఖకు వెళ్లి వెంటనే కేవైసీని పూర్తి చేయండి. లేకపోతే, ఈ బ్యాంక్ ఖాతాలు జూలై 1, 2024న మూసివేయబడతాయి.

పీఎన్‌బీ ఈ ఖాతాలు జూన్ 30 నాటికి మూసివేత

ఇవి కూడా చదవండి

పీఎన్‌బీ కొన్ని రోజుల క్రితం తమ ఖాతాదారులకు కేవైసీని పొందాలని తెలియజేసింది. అయితే, బ్యాంక్ గడువును జూన్ 30, 2024 వరకు పొడిగించింది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఈ ఖాతాలు మూసివేయబడతాయి. చాలా మంది స్కామర్లు కస్టమర్‌లు చాలా కాలంగా ఉపయోగించని ఖాతాలను దుర్వినియోగం చేస్తారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఈ పెద్ద అడుగు వేసింది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఖాతా లెక్కింపు ఏప్రిల్ 30, 2024 ఆధారంగా చేస్తోంది. అలాంటి ఖాతాదారులకు బ్యాంకు ఇప్పటికే నోటీసులు పంపింది.

కేవైసీ పూర్తయిన తర్వాత ఈ బ్యాంక్ ఖాతాలు మళ్లీ యాక్టివ్‌గా..

బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఖాతా నిష్క్రియంగా మారితే, ఖాతాదారుడు ఖాతాను తిరిగి సక్రియం చేయాలనుకుంటే, అటువంటి ఖాతాదారులు శాఖకు వెళ్లి కేవైసీ ఫారమ్‌ను పూరించాలి. కేవైసీ ఫారమ్‌తో పాటు, కస్టమర్ అవసరమైన పత్రాలను కూడా సమర్పించాలి. దీని తర్వాత వారి ఖాతా యాక్టివ్‌గా మారుతుంది. మరింత సమాచారం కోసం ఖాతాదారులు బ్యాంకును సందర్శించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి