Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. విత్‌డ్రా లిమిట్‌ పెంపు.. కొత్త నిబంధనలు

Post Office: ఇండియా పోస్ట్‌ తన పోస్టల్‌ ఖాతాదారులకు తీపి కబురు అందించింది. ఇండియా పోస్ట్ తన ఖాతాదారుల రోజువారీ విత్ డ్రా లిమిట్‌ను పెంచింది. అయితే ఇండియా పోస్ట్..

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. విత్‌డ్రా లిమిట్‌ పెంపు.. కొత్త నిబంధనలు
Post Office

Updated on: Aug 11, 2021 | 6:05 PM

Post Office: ఇండియా పోస్ట్‌ తన పోస్టల్‌ ఖాతాదారులకు తీపి కబురు అందించింది. ఇండియా పోస్ట్ తన ఖాతాదారుల రోజువారీ విత్ డ్రా లిమిట్‌ను పెంచింది. అయితే ఇండియా పోస్ట్ తీసుకోచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఖాతాదారులు గ్రామీణ డాక్ సేవ శాఖలో ఒక రోజులో రూ.20 వేల వరకు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంతకుముందు విత్ డ్రా పరిమితి కేవలం రూ.5 వేల మాత్రమే ఉండేది. ఇండియా పోస్ట్ తన కొత్త మార్గదర్శకాలలో పేర్కొన్న ప్రకారం ఏ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) ఒక రోజులో ఒక ఖాతాలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ గా స్వీకరించరాదని తెలిపింది. అంటే ఒక ఖాతా ద్వారా రూ.50 వేల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు ఒక రోజులో చేయలేము.

కొత్త నిబంధనలు:

ఇండియా పోస్ట్ యొక్క కొత్త నిబంధనల ప్రకారం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్ సీఎస్ఎస్), మంత్లీ ఇన్ కమ్ స్కీం (ఎంఐఎస్), కిసాన్ వికాస్ పాత్రా(కెవిపి), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్ సీ) స్కీంల కోసం డిపాజిట్ లేదా విత్ డ్రా చెక్కులు ద్వారా చేసుకోవచ్చు.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం.. కనీస బ్యాలెన్స్
పోస్టల్‌ శాఖలో పొదుపు పథకంపై 4 శాతం వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు స్కీమ్‌ ఖాతాలో కనీసం రూ.500 బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. అయితే కనీస బ్యాలెన్స్ రూ.500 కంటే తక్కువగా ఉంటే ఖాతా నిర్వహణ చార్జీల కింద పెనాల్టీగా రూ.100 వసూలు చేస్తారు.

పోస్టాఫీసు పొదుపు పథకాలు.. వడ్డీ రేటు

➦ సుకన్య సమృద్ధి ఖాతాదారులకు: 7.6 శాతం

➦  కిసాన్ వికాస్ పాత్ర: 6.9 శాతం

➦  పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా: 4శాతం

➦  ఏడాది వరకు టీడీ ఖాతా: 5.5 శాతం

➦  2 ఏళ్ల వరకు టీడీ ఖాతా: 5.5 శాతం

➦ 5 ఏళ్ల వరకు టీడీ ఖాతా: 6.7శాతం

➦ 5 ఏళ్ల ఆర్‌డీ: 5.8 శాతం

➦ పీపీఎఫ్ పొదుపు పథకం: 7.1 శాతం

➦ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం: 7.4 శాతం

ఇవీ కూడా చదవండి

RBI: మహిళా సంఘాలకు రిజర్వ్ బ్యాంక్‌ గుడ్‌న్యూస్‌.. ఎలాంటి తనఖా లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..!

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10 వేల డిపాజిట్‌తో రూ.7 లక్షలు పొందవచ్చు

Loading...
Unable to load recommendations.
Follow Us