చాలా మంది బ్యాంకు నుంచి లోన్స్ తీసుకుంటారు. ఎంతో మంది వ్యక్తిగత, గృహ రుణాలను తీసుకుంటారు. అలాగే పర్సనల్ లోన్‌తో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా లోన్ పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో జమ చేసిన మొత్తంపై 80 నుంచి 90 శాతం వరకూ లోన్ పొందవచ్చు. ఈ మధ్య కాలంలో ఎఫ్‌డీకి వ్యతిరేకంగా లోన్ కోసం డిమాండ్ వేగంగా పెరుగుతోంది. తాజా ఆర్బీఐ డేటా ప్రకారం.. జూలై 1, 2022న బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై లోన్ రూ. 82,252 కోట్లుగా ఉంది. ఇది జూన్ 30, 2023న రూ.1,20,427 కోట్లకు పెరిగింది. అంటే ఒక సంవత్సరంలో ఎఫ్‌డీ పై అప్పు 46 శాతం కంటే ఎక్కువ పెరిగింది. వడ్డీ రేటు తక్కువగా ఉన్నందున ఎఫ్‌డీకి వ్యతిరేకంగా లోన్ ఆప్షన్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ మే 2022 నుంచి రెపో రేటును రికార్డు స్థాయిలో 2.5 శాతం పెంచింది. దీని కారణంగా అన్ని రకాల రుణాలు ఖరీదైనవిగా మారాయి. ప్రధాన బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు వ్యక్తిగత రుణాలపై సంవత్సరానికి 11 నుంచి 22 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. అలాగే, ఈ రుణంపై రెండు నుంచి మూడు శాతం ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తారు. సాధారణంగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు CIBIL స్కోర్ ఆధారంగా నిర్ణయిస్తారు. మీ CIBIL స్కోర్ బలహీనంగా ఉంటే.. ఈ లోన్ మరింత ఖరీదైనదిగా ఉంటుందని గుర్తించుకోండి.
పర్సనల్ లోన్ అనేది అన్ సెక్యూర్డ్ లోన్. రికవరీ ప్రమాదం ఉన్నందున ఇది ఖరీదైనది. కానీ మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై రుణం సెక్యూర్డ్ లోన్ కేటగిరీ కింద వస్తుంది. అందేకే ఇది చౌకైనదిగా ఉంటుంది. బ్యాంకులు ఎలాంటి ప్రాసెసింగ్‌ను వసూలు చేయవు. ఫిక్స్‌డ్ డిపాజిట్ లోన్‌పై రుసుములు కూడా ఏమీ ఉండవు. ఎఫ్‌డీ లోన్స్ పై బ్యాంకులు తక్కువ రేట్లు వసూలు చేస్తాయి. ఎఫ్‌డీ వడ్డీతో పోలిస్తే బ్యాంకులు సాధారణంగా ఈ లోన్ పై 0.5 నుంచి 2% ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. అంటే ఎఫ్‌డీ పై బ్యాంక్ మనకు ఇచ్చే వడ్డీ కన్నా దానిపై మనకు ఇచ్చే లోన్ పై ఎక్కువ వడ్డీని తీసుకుంటాయి. ఎఫ్‌డీపై వచ్చే రాబడితో పోలిస్తే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ ఒక శాతం ఎక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. ఉదాహరణకు మీరు మీ ఎఫ్‌డీపై 6.5 శాతం వడ్డీని పొందుతున్నట్లయితే, బ్యాంకు రుణంపై 7.5 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. అదేవిధంగా ఎఫ్‌డీపై లోన్ తీసుకోవడం ఈజీ కూడా.
ఎఫ్‌డీని కలిగి ఉన్న బ్యాంక్‌లో రిక్వెస్ట్ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు కాపీని, అంటే FDR జత చేసి సబ్మిట్ చేయాలి. కొన్ని బ్యాంకులు రద్దు చేసిన చెక్కు కాపీని కూడా అడుగుతాయి. ఒక సాధారణ ప్రక్రియ తర్వాత, రుణం మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది. బ్యాంకులు ఎఫ్‌డీపై రెండు విధాలుగా లోన్స్ ఇస్తాయి. మొత్తం ఎమౌంట్ ఒకేసారి లేదా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యంగా. ఎఫ్‌డీ మొత్తంలో 80 నుంచి 90 శాతం వరకు లోన్ అందుబాటులో ఉంటుంది. కానీ మీరు లోన్ తీసుకునే బదులు ఓవర్‌డ్రాఫ్ట్ కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే.. మీ వద్ద 8 లక్షల రూపాయల ఎఫ్‌డీ ఉంటే బ్యాంక్ దానిపై 5 లక్షల రూపాయల ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని ఇస్తుంది. మీరు మీ అవసరాన్ని బట్టి డబ్బు తీసుకోవచ్చు. మీరు 2 లక్షల రూపాయలు విత్‌డ్రా చేసి ఉంటే ఈ డబ్బుపై బ్యాంక్ మీకు వడ్డీని వసూలు చేస్తుంది. మీరు డబ్బును ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఈ ఓవర్ డ్రాఫ్ట్ ను క్లియర్ చేసుకోవచ్చు.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై తీసుకున్న లోన్ తిరిగి చెల్లించడానికి ఎటువంటి నిర్ణీత వ్యవధి లేదు. ఇప్పటికీ ఎఫ్‌డీ మెచ్యూర్ అయ్యేలోపు ఈ లోన్ చెల్లించమని బ్యాంక్ అడగవచ్చు. మీరు ఈ లోన్ తిరిగి చెల్లించలేకపోతే ఎఫ్‌డీ మెచ్యూరిటీ తర్వాత, బ్యాంక్ మీ మొత్తం లోన్ తీసుకుంటుంది. మిగిలిన డబ్బును మీ బ్యాంక్ ఎకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎఫ్‌డీపై లోన్ సెక్యూర్డ్‌గా ఉన్నందున ఒక మంచి ఆప్షన్ అని టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు బల్వంత్ జైన్ చెప్పారు. అయితే ఈ లోన్ అవసరమైన పని కోసం మాత్రమే తీసుకోండి. ఈ లోన్ తీసుకోవడం అనేది అంత సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఎందుకంటే రితరిమేంట్ జీవితం కోసం దాచుకున్న్ డబ్బు ముందుగ లోన్ రూపంలో తీసుకుంటే.. చివరికి వచ్చేసరికి అవసరమైన వడ్డీ అందించదు.
మరే ఇతర మూలాధారం నుంచి డబ్బు అందుబాటులో లేనప్పుడు, తప్పనిసరి అవసరం అయినప్పుడూ మాత్రమే ఎఫ్‌డీకి వ్యతిరేకంగా లోన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ కాలం కోసం డబ్బు అవసరమైతే అప్పుడు ఎఫ్‌డీపై అప్పును తీసుకోవడం కంటే దానిని ముందుగానే క్లోజ్ చేసుకోవడం మంచిది. దీనివలన దీనితో మీరులోన్ పై వడ్డీని ఆదా చేసుకోవచ్చు. ఐదేళ్ల టాక్స్ పై సేవింగ్స్ FD లోన్ లో అందుబాటులో ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి