Savings Tips: నెల జీతం రూ.30 వేలేనా..? అయినా లక్షల్లో పొదుపు చేయొచ్చు.. ఈ స్మార్ట్ ప్లాన్ తెలిస్తే చాలు..

మా జీతం తక్కువ.. పొదుపు చేయలేకపోతున్నామని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ చిన్న జీతం అయినా ఒక ప్రణాళిక ప్రకారం వెళితే డబ్బులు పొదుపు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొన్ని టిప్స్ కూడా సూచిస్తున్నారు. రూ.30 వేల జీతం ఉన్నవారు ఎలా పొదుపు చేసుకోవాలనేది చూద్దాం.

Savings Tips: నెల జీతం రూ.30 వేలేనా..? అయినా లక్షల్లో పొదుపు చేయొచ్చు.. ఈ స్మార్ట్ ప్లాన్ తెలిస్తే చాలు..
Money Savings

Updated on: Nov 10, 2026 | 6:55 PM

తమకు నెలవారీ వచ్చే జీతంలో కొంత డబ్బులు పొదుపు చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ ఖర్చులు, అవసరాలు, వృధా ఖర్చులు, సరైన అవగాహన లేకపోవడం వల్ల డబ్బులు ఆదా చేసుకోలేకపోతుంటారు. రోజువారీ ఖర్చులు, అద్దె, కిరాణా సరుకులు, జర్నీ ఖర్చులు, ఈఎంఐలకే తమ జీతం డబ్బులు సరిపోతున్నాయని అంటుంటారు. అయితే సరైన ప్రణాళిక, బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, తెలివితో ఆలోచిస్తే తక్కువ జీతం ఉన్నా పొదుపు చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి..? పెట్టుబడులు ఎలా పెట్టాలి? అనే దానిపై పలు సూచనలు చేస్తున్నారు.

రూ.30 జీతాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి..

మీ జీతం రూ.30 వేలు ఉందనుకుంటే.. రోజువారీ ఖర్చులకే సగం డబ్బులు పోతాయి. అద్దె రూ.7 వేలు, విద్యుత్‌తో పాటు ఇతర యుటిలిటీ బిల్లులకు రూ.3 వేలు కేటాయించండి. దీంతో ఇక మీ దగ్గర రూ.20 వేలు ఉంటాయి. రవాణా ఖర్చుల కోసం రూ.3 వేలు పక్కన పెట్టండి. ఒక ఫోన్, వైఫై రీఛార్జ్ కోసం రూ.వెయ్యి కేటాయించండి. కిరాణా సరుకులు, ఇతర ఖర్చులకు రూ.9 నుంచి రూ.10 వేలు పోతే మీరు ప్రతీ నెలా రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు పొదుపు చేసుకోవచ్చు.

దేని వాటా ఎంత..?

ముందుగా మీ పొదుపులో అత్యవసర నిధికి కొంత కేటాయించండి. దీని వల్ల ఎమర్జెన్సీ పరిస్థితులు, ఉద్యోగం కోల్పోయినప్పుడు లేదా ఊహించని సంఘటనలు ఎదురైనప్పుడు మీ ఆర్ధిక అవసరాలు తీరుతాయి. దీని వల్ల మీరు అప్పులు చేయాల్సిన పని ఉండదు. ఇక మీ పొదుపులో రూ.3 వేలు సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టండి. మీ పెట్టుబడిపై చక్రవడ్డీ వల్ల భవిష్యత్తులో మీ పెట్టుబడి మరింత పెరుగుతుంది. మార్కెట్ రిస్కుల ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మీ పెట్టుబడి పెరుగుతుంది. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ స్కీములు, కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాలు, వివిధ పాలసీలలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇలా ప్రణాళికంగాబద్దంగా మీ ఖర్చులను నిర్వహించుకోవడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. రూ.30 వేల జీతంతో పొదుపు చేసుకోవాలంటే ఇలా ఒక ప్లాన్ రూపొందించుకోండి.

ఈ స్మార్ట్ టిప్స్ పాటిస్తే చాలు

-అకస్మిక కొనుగోళ్లను తగ్గించుకోండి

-అవసరం లేని వాటిపై వృథా ఖర్చులు చేయకండి

-అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి

-ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు చేసేముందు అది ఎంత అవసరం అనేది ఆలోచించుకోండి

-అప్పులకు దూరంగా ఉండండి. అధిక వడ్డీలు ఉంటే అప్పులు అస్సలు తీసుకోవద్దు

Loading...
Unable to load recommendations.
Follow Us