గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి మోసాలు జరిగే ఛాన్సుంది? మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

బంగారంపై రుణాలిచ్చే వ్యాపారంలో ఈ మధ్య కాలంలో చాలా అక్రమాలు, అవకతవకలు పెరుగుతూ ఉండటంతో అటు కేంద్ర ఆర్థిక శాఖ, అలాగే రిజర్వ్ బ్యాంకు కూడా అలెర్ట్ అయ్యాయి. కొన్ని కంపెనీలు నిబంధనలను కాలరాస్తున్నాయన్న విషయాన్ని ఆర్థిక శాఖ గుర్తించింది. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ గోల్డ్‌లోన్ విధానాలను సమీక్షించుకోవాలని ఆర్థిక శాఖ కోరింది.

గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి మోసాలు జరిగే ఛాన్సుంది? మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
Gold Loan Market

Updated on: Jul 09, 2024 | 8:51 AM

కుమార్.. ఓ చిరు వ్యాపారి. డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా.. ఉన్న కాస్త బంగారాన్ని తన దుకాణానికి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతి నెలా… సమయానికి వడ్డీ చెల్లిస్తుండటం..డబ్బులు కుదిరిన వెంటనే వాటిని తాకట్టు నుంచి విడిపించుకుంటూ ఉండటంతో కొద్ది నెలల క్రితం వరకు  పెద్దగా సమస్యలు ఎదురు కాలేదు.  కానీ ఇటీవల మళ్లీ అవసరం వచ్చి అదే ప్రైవేటు కంపెనీకి వెళ్లాడు.  గతంతో పోల్చుకుంటే ఈ సారి తనకు మరి కాస్త ఎక్కువ డబ్బు అవసరం పడింది. అయితే అప్పటికే బంగారం ధర పెరగడం తన దగ్గర బంగారాన్ని లెక్క చూసుకొని అంత డబ్బు వస్తుందన్న నమ్మకంతో సదరు ప్రైవేటు కంపెనీకి వెళ్లాడు. ఎప్పటిలాగే బంగారాన్ని ఇచ్చి తనకు కావాల్సిన డబ్బెంతో కూడా చెప్పాడు. కానీ.. విచిత్రమేంటంటే.. ఆ కంపెనీ ఉద్యోగులు అంత రాదని చెప్పారు. అదేంటని ప్రశ్నిస్తే.. తాము అనుకున్నంతే ఇస్తాని.. కావాలంటే తీసుకెళ్లండి లేకపోతే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఊసురుమంటూ వాళ్లిచ్చినంతే తీసుకొని మిగిలిన డబ్బులు ఎలా సర్దుకోవాలని అని ఆలోచిస్తూ వెళ్లిపోయాడు” ఇలాంటి అనుభవం కాకపోయినా.. సమస్య మాత్రం దాదాపు అలాంటిదే ఎదురయ్యింది  విజయనగరానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి. అలాంటి ఓ ప్రైవేటు కంపెనీలోనే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. తీసుకునే సమయంలో వడ్డీ రేటు కూడా చెక్ చేసుకున్నారు. అనుకున్న ప్రకారం నెల నెలా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి