Gold Insurance: బంగారం పొగొట్టుకున్నారా..? ఈ ఒక్క పనితో నష్టపరిహారం పొందొచ్చు.. ఈ విషయం 90 శాతం మందికి తెలియదు

గత ఏడాదిగా దేశంలో బంగారం, సిల్వర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.లక్ష 60 వేల దగ్గర కొనసాగుతున్నాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్న క్రమంలో ఇవి విలువైన లోహలుగా మారిపోయాయి. దీంతో వీటికి భద్రత కల్పించేందుకు మార్కెట్లోకి గోల్డ్ ఇన్యూరెన్స్‌లు వచ్చేశాయి.

Gold Insurance: బంగారం పొగొట్టుకున్నారా..? ఈ ఒక్క పనితో నష్టపరిహారం పొందొచ్చు.. ఈ విషయం 90 శాతం మందికి తెలియదు
Gold Insurance

Updated on: Feb 10, 2026 | 4:53 PM

ఇటీవల పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్, వెండి అత్యంత ఖరీదైన ఆస్తులుగా మారిపోయాయి. భారతీయులు వీటిని ధరించే ఆభరణాలుగానే కాకుండా ఆస్తిగా పరిగణిస్తారు. ఒక పొదుపు సాధనంగా బంగారాన్ని కొనుగోలు చేసి లాకర్లలో భద్రపర్చుకుంటూ ఉంటారు. డబ్బులు అవసరమైన సమయంలో గోల్డ్ తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం చేస్తూ ఉంటారు. తీవ్రమైన ఆర్ధిక పరిస్థితి ఎదురైనప్పుడు ఫ్యామిలీని గట్టెక్కించడానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో బంగారాన్ని దాచుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఆర్ధిక పరిస్థితి దిగజారినప్పుడు బంగారాన్ని విక్రయించి తమ అవసరాలకు వినియోగించుకుంటారు. దీంతో అత్యంత విలువ చేసే బంగారాన్ని భద్రపర్చుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఇటీవల గోల్డ్ ఇన్యూరెన్స్‌లు కూడా మార్కెట్లో పాపులర్ అవుతున్నాయి.

గోల్డ్ ఇన్యూరెన్స్ అంటే..?

హెల్త్, లైఫ్, వెహికల్ ఇన్యూరెన్స్ రాగానే బంగారానికి భద్రత కల్పించేదే గోల్డ్ ఇన్యూరెన్స్‌గా చెప్పవచ్చు. మీ బంగారం చోరీకి గురైనప్పుడు లేదా దోపిడీ జరిగినప్పుడు, చైన్ స్నాచింగ్, ఫైర్ యాక్సిడెంట్, భూకంపం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు గోల్డ్ ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైనా అనుకుని సంఘటన జరిగి మీ గోల్డ్ పోయినప్పుడు మీరు ఆర్ధికంగా నష్టపోతారు. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు గోల్డ్ ఇన్యూరెన్స్‌లు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చాయి.

ప్రీమియం ఎలా ఉంటుంది..?

మీరు తీసుకునే బీమా సొమ్మును బట్టి ప్రీమియం ఉంటుంది. అలాగే బీమా గడువు, ఆభరణాలు సంఖ్య, ఎంత కవరేజీ కావాలనే వివరాలను బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, రిలయన్స్ జనరల్ ఇన్యూరెన్స్, న్యూ ఇండియా ఎస్యూరెన్స్, బజాజ్ అలియాజ్, ఐసీఐసీఐ లంబార్డ్, ఓరియెంటల్ ఇన్యూరెన్స్ వంటి కంపెనీలు గోల్డ్ ఆభరణాలకు ఇన్యూరెన్స్ అందిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా మీరు బీమాను పొందవచ్చు. ప్రస్తుతం గోల్డ్ షాపుల యాజమానులే ఏడాది పాటు కస్టమర్లకు ఉచితంగా బీమా సౌకర్యం అందిస్తున్నాయి. మొదటి ఇయర్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఇక రెండో ఏడాది నుంచి మీరు ప్రీమియం చెల్లించి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గోల్డ్ షాపులవారు ఇవ్వకపోతే మీరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సి ఉంటుంది.

వీటికి మాత్రమే ఇన్యూరెన్స్

గోల్డ్, వెండి, ప్లాటినం, క్రిస్టల్ వేర్, చేతి గడియారాలు, ఇతర లోహలతో కూడిన ఆభరణాలు, ఆభరణాల రూపంలో లేని బంగారంకు ఇన్యూరెన్స్ తీసుకోవచ్చు. ఇక కొన్ని బీమా కంపెనీలు రవాణా సమయంలో జరిగే నష్టాలకు కూడా బీమా కవరేజీ అందిస్తున్నాయి. ఇక కొన్ని కంపెనీలు అల్లర్లు, సమ్మెల వంటి సమయంలో బంగారు ఆభరణాలకు ఏమైనా నష్టం జరిగినా బీమా క్లెయిమ్ అందిస్తున్నాయి. ఇక ఆల్ రిస్క్ కవర్ అనే ఆప్షన్ ఎంచుకుంటే బంగారం ఏ పరిస్థితుల్లో పోయినా క్లెయిమ్ పొందవచ్చు.