AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali : ఒక్కో షేరుకు రెండు ఫ్రీ.. వాటాదారులకు పతంజలి ఫుడ్స్ బంపర్ ఆఫర్..

పతంజలి ఫుడ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించింది. ప్రస్తుత వాటాదారులకు ప్రయోజనం చేకూర్చడానికి, మార్కెట్లో కంపెనీ వాటాల లిక్విడిటీని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోనస్ షేర్ల ప్రకటనతో కంపెనీ షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే..

Patanjali : ఒక్కో షేరుకు రెండు ఫ్రీ.. వాటాదారులకు పతంజలి ఫుడ్స్ బంపర్ ఆఫర్..
Patanjali
Krishna S
|

Updated on: Jul 18, 2025 | 3:18 PM

Share

పతంజలి గ్రూప్ తన పెట్టుబడిదారులకు బంపర్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. పతంజలి ఫుడ్స్ బోనస్ షేర్లను వాటాదారులకు ఇస్తామని ప్రకటించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది. అంటే కంపెనీలో 1 షేర్ కొంటే రెండు షేర్లు ఫ్రీగా లభిస్తాయి. కంపెనీ త్వరలో రికార్డ్ తేదీని ప్రకటిస్తుంది. రికార్డు డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే పెయిడ్ అప్ ఈక్విటీ షేర్లు ఉంటాయో వారు బోనస్ షేర్లను పొందవచ్చు. రెండు నెలల్లో ఈ బోనస్ షేర్లను జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత వాటాదారులకు ప్రయోజనం చేకూర్చడానికి, మార్కెట్లో కంపెనీ వాటాల లిక్విడిటీని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోనస్ షేర్ల ప్రకటనతో కంపెనీ షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ దాదాపు 72,50,12,628 కొత్త షేర్లను కంపెనీ జారీ చేస్తుంది. బోనస్ తర్వాత కంపెనీ మొత్తం షేర్ క్యాపిటల్ రూ.145 కోట్ల నుంచి రూ.217.50 కోట్లకు పెరుగుతుంది. పతంజలి ఫుడ్స్ యొక్క నికర లాభం మార్చి 2025 త్రైమాసికంలో 74శాతం పెరిగి.. 358.53 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 206.31 కోట్లుగా ఉంది. కంపెనీ నిర్వహణ ఆదాయం కూడా రూ.9,744.73 కోట్లకు పెరిగింది. గతేడాది ఇది రూ.8,348.02 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ. 1,301.34 కోట్లుగా ఉంది. గతేడాది 765.15 కోట్ల కంటే ఇది ఎక్కువ. ఇక మొత్తం దాయం రూ.34,289.40 కోట్లుగా ఉంది. గతేడాది ఇది రూ.31,961.62 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ గత ఏడాదిలో 19శాతం కంటే ఎక్కువ లాభపడగా.. ఇప్పుడు రూ.1,862.35 వద్ద ట్రేడవుతోంది. అయినప్పటికీ ఇది ఇప్పటికీ దాని 52 వారాల గరిష్ట స్థాయి స్థాయి కంటే దాదాపు 8శాతం తక్కువగా ఉంది.

బోనస్ షేర్లు అంటే ఏమిటి?

బోనస్ షేర్లు అంటే కంపెనీ తన ప్రస్తుత వాటాదారులకు ఉచితంగా ఇచ్చే అదనపు షేర్లు. ఈ షేర్లు కంపెనీ నిల్వల నుండి ఇవ్వబడతాయి. ఇది కంపెనీ మొత్తం షేర్ల సంఖ్యను పెంచుతుంది. షేర్ ధర అదే నిష్పత్తిలో తగ్గుతుంది. కానీ కంపెనీ మొత్తం విలువ అలాగే ఉంటుంది. ఇది కంపెనీ మంచి ఆర్థిక స్థితిని సూచిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..