Post Office: పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!

|

Jan 08, 2025 | 3:32 PM

Post Office: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కి చెందిన చాలా మంది కస్టమర్‌లు తమ పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయనందున తమ బ్యాంక్ ఖాతాలు బ్లాక్ అవుతున్నాయా? నేటి డిజిటల్ యుగం మన జీవితాలను సులభతరం చేసింది. మన ఆర్థిక లావాదేవీలను కూడా ప్రమాదకరం చేస్తోంది.

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులే వారి టార్గెట్.. అకౌంట్లు బ్లాక్‌..!
Follow us on

నేటి డిజిటల్ యుగం మన జీవితాలను సులభతరం చేసింది. సౌకర్యవంతంగా మార్చింది. ఇది మన ఆర్థిక లావాదేవీలను కూడా ప్రమాదకరం చేసింది. మోసగాళ్లు కొత్త పద్ధతులను అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. కొన్నిసార్లు వారు తమను తాము మీ బంధువులుగా, కొన్నిసార్లు కొందరు ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసుకుంటారు. ఇండియా పోస్ట్ పేమెంట్ (IPPB) ఖాతాదారులతో అలాంటి మోసం ఒకటి జరుగుతోంది. పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయనందున వారి బ్యాంక్ ఖాతాలు బ్లాక్ చేస్తున్నామని ఫేక్ మెసేజ్‌లను కస్టమర్‌లకు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పేరుతో వస్తున్న ఈ మెసేజ్‌కు సంబంధించి ఇండియన్ పోస్ట్ ఎప్పుడూ అలాంటి మెసేజ్ పంపదని PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలియజేసింది.

మెసేజ్‌ల ద్వారా వ్యక్తిగత డేటా చోరీ:

ఇండియా పోస్ట్ పేమెంట్స్ కస్టమర్ల ఫోన్‌లలో వారి పాన్ కార్డ్ వివరాలు అప్‌డేట్ కాలేదని మెసేజ్ వస్తుంది. దాని కోసం మెసేజ్‌లో లింక్ కూడా ఉంటుంది. కస్టమర్‌లు ఆ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే, స్కామర్‌లు వ్యక్తిగతంగా యాక్సెస్ చేస్తారు. డేటాను దొంగిలించడం ద్వారా ప్రజల ఖాతాలను ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఫిషింగ్ గురించి ప్రభుత్వ సలహా:

స్కామర్ మీ వ్యక్తిగత డేటాను ఆన్‌లైన్‌లో దొంగిలించినప్పుడు దానిని ఫిషింగ్ అంటారు. ఇది ఒక రకమైన సైబర్ దాడి. ఇది ఇమెయిల్‌లు, టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఫోన్ కాల్‌లు, ఇతర కమ్యూనికేషన్ పద్ధతుల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటుంది. దీన్ని నివారించడానికి ప్రభుత్వ PIB ఫ్యాక్ట్ చెక్ బృందం తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో కస్టమర్ పాన్ కార్డ్ అప్‌డేట్ కాకపోతే అతని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా 24 గంటల్లో బ్లాక్ చేస్తామంటూ ఆ మెసేజ్‌లో ఉంటుంది. ఇలాంటి లింక్‌లు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, అంతా ఫేక్‌ అని ఫ్యాక్ట్‌ చెక్‌ స్పష్టం చేసింది. మీ వ్యక్తిగత, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పోస్ట్‌లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Tech Tips: మీ మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి