One Nation One Gold Rate: దేశీయ సాంప్రదాయంలో మహిళలకు బంగారానికి అధికంగా విలువ ఇస్తుంటారు. అయితే బంగారం ధరల విషయానికొస్తే దేశంలో అన్ని ప్రాంతాల్లో రేటు ఒకేటా ఉండదు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కవ రేటు ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ రేటు ఉంటుంది. అందుకు కారణం ఏంటంటే.. రవాణా ఛార్జీల్లో తేడా ఉండట వల్ల ప్రాంతాలను బట్టి ధర మారుతూ ఉంటుంది. ఇక దేశ వ్యాప్తంగా ఒకే బంగారం ధర (One Nation One Gold Rate)ను అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. ఈ స్కీమ్ అమలైతే బంగారం కొనుగోళ్లు మరింతగా ఊపందుకోనుంది. బులియన్ ఎక్స్ఛేంజ్ ప్రారంభంతో నగల వ్యాపారులు ఇప్పుడు అంతర్జాతీయ ధరలకు బంగారం కొనుగోలు చేసే సదుపాయాన్ని పొందుతారు. వారు ఎటువంటి రవాణా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రవాణా ఛార్జీలు విధించడం వల్ల వివిధ రాష్ట్రాల్లో బంగారం ధర మారుతుంది. ఈ విధానం అమలైతే ఎక్కవ ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సమస్య త్వరలో తొలగిపోనుంది. అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్‌కు ధన్యవాదాలు చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో వన్ గోల్డ్ వన్ రేట్ పథకాన్ని అమలు చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
దేశంలో వన్ గోల్డ్ వన్ రేట్ పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్ పాతదే. ఎందుకంటే అదే బంగారాన్ని ఆగ్రాలో వేరే ధరకు, భోపాల్‌లో వేరే ధరకు విక్రయిస్తారు. తమిళనాడు నుండి జమ్మూ కాశ్మీర్ వరకు బంగారం ధరలో తేడాను గమనించవచ్చు. అయితే బంగారం అలాగే ఉంటుంది. స్వచ్ఛత కొలమానం కూడా అదే. ఎందుకంటే బంగారాన్ని దిగుమతి చేసుకుని ల్యాండ్ అయ్యే పోర్టు అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు పంపిస్తారు. షిప్పింగ్ ఖర్చు మొదలైన వాటిని జోడించిన తర్వాత బంగారం ధర మారుతుంది. దిగుమతి సమయంలో బంగారం ధర అలాగే ఉంటుంది. ధరలో వ్యత్యాసాన్ని తొలగించడానికి భారత ప్రభుత్వం చాలా కాలంగా వన్ గోల్డ్ వన్ రేట్‌ను అమలు చేసేందుకు పరిశీలిస్తోంది. ఇప్పుడు ఈ ఐడియా సక్సెస్ అయితే బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. అయతే బంగారాన్ని దేశంలో ఎక్కడ కొనుగోలు చేసినా ఒకే రేటు ఉంటుంది.
ఆభరణాల వ్యాపారుల్లో ఆనందం ..
బులియన్ ఎక్స్ఛేంజ్ ప్రారంభంతో అంతర్జాతీయ ధరలకు బంగారం కొనుగోలు చేసే సౌకర్యం, రవాణా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని నగల వ్యాపారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రవాణా ఛార్జీలు విధించడం వల్ల వివిధ రాష్ట్రాల్లో బంగారం ధర మారుతుంది. బులియన్ ఎక్స్ఛేంజ్ ప్రారంభంతో ఆభరణాలు, బ్యాంకులు అంతర్జాతీయ ధరలకు మాత్రమే బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. తద్వారా బంగారం ధరలలో తేడా ఉండదు.
ముఖ్యంగా GIFT సిటీ ఆఫ్ బులియన్ ఎక్స్ఛేంజ్ ఓడరేవులకు దగ్గరగా ఉంది. అందువల్ల భారతీయ ఆభరణాలు ప్రారంభ దశలో సరుకు రవాణాపై సంవత్సరానికి సుమారు రూ. 10 కోట్లు ఆదా చేయవచ్చని భావిస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అయితే, బంగారం, వెండి కోసం ప్రస్తుతం ఎక్స్ఛేంజ్ తెరవబడింది. భవిష్యత్తులో ఎక్స్ఛేంజ్లో బేస్ మెటల్స్ కూడా అందుబాటులో ఉండవచ్చు. స్పాట్ ఎక్స్ఛేంజ్ ద్వారా నేరుగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం పెద్ద ఆభరణాల వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా మార్జిన్ చెల్లింపులపై డబ్బు ఆదా అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..