భారతదేశంలోని సిక్కిం రాష్ట్రం ఏకైక పన్ను రహిత రాష్ట్రంగా ఉంది. ఇక్కడ నివాసితులు ఆర్టికల్ 371(ఎఫ్) ప్రకారం పూర్తి ఆదాయపు పన్ను మినహాయింపును పొందుతారు. 1975లో భారతదేశంతో రాష్ట్ర విలీన ఒప్పందం ప్రకారం ఏర్పాటైన ఈ పన్ను రహిత స్థితి దాని పౌరులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(ఎఫ్), ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(26ఏఏఏ) సిక్కింనకు సంబంధించిన పన్ను-రహిత స్థితిని కాపాడుతుంది. సిక్కిం నివాసితులు ఆదాయపు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు వస్తుంది. సిక్కిం సబ్జెక్ట్స్ రెగ్యులేషన్, 1961 ప్రకారం సిక్కిమీస్‌గా గుర్తించిన వ్యక్తులకు సెక్యూరిటీలు, డివిడెండ్‌లపై వడ్డీతో సహా అన్ని ఆదాయాలకు వర్తిస్తుంది.
సాధారణంగా భారతదేశం అంతటా వ్యక్తులు వారి ఆదాయం నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను చెల్లించాలి. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా సిక్కిం నివాసితులు కోట్ల రూపాయల్లో ఆదాయం వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సిక్కిమీస్ నివాసితులకు మినహా అర్హులైన వ్యక్తులు ప్రతి ఏడాది జూలై 31లోపు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి.
ఆదాయపు పన్ను లేకపోవడం వల్ల ప్రజలు పొదుపులు, పెట్టుబడులను వైపు మళ్లుతారని నిపుణులు చెబుతున్నారు. సిక్కిం రాష్ట్రానికి ఈ ప్రత్యేక హోదా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. పర్యాటకం, వ్యవసాయం, చిన్న వ్యాపారాలు వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. మినహాయింపు స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతివ్వడమే కాకుండా సిక్కింను పెట్టుబడి అనుకూల ప్రాంతంగా నిలబెట్టింది.సిక్కిం పన్ను-రహిత స్థితి, చారిత్రక ఒప్పందాల ద్వారా వచ్చింది. అలాగే చట్టపరమైన నిబంధనల ద్వారా బలోపేతం అయ్యిందని నిపునులు వివరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి