AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ఎవరు చేయలేనిది అంబానీ చేసి చూపించారు.. జియో హాట్‌స్టార్ రికార్డు

Jio Hotstar: జియోస్టార్‌లో ముఖేష్ అంబానీ, అతని సంస్థకు మెజారిటీ వాటా ఉంది. డేటా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోస్టార్‌లో 63.16 శాతం వాటాను కలిగి ఉంది. అందులో 16.34 శాతం ప్రత్యక్ష వాటా, 46.82 శాతం వయాకామ్ 18 ద్వారా ఉంది. మరోవైపు, ఈ జాయింట్ వెంచర్‌లో డిస్నీకి 36.84 శాతం వాటా ఉంది. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌ రికార్డు సృష్టించింది..

Mukesh Ambani: ఎవరు చేయలేనిది అంబానీ చేసి చూపించారు.. జియో హాట్‌స్టార్ రికార్డు
Subhash Goud
|

Updated on: Mar 14, 2025 | 6:55 PM

Share

డిస్ని+హాట్‌స్టార్‌ జియో హాట్‌స్టార్‌గా విలీనం అయినప్పటి నుండి రికార్డు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త వెంచర్ పేరు జియో హాట్‌స్టార్ గా మారింది. జియో స్టార్ నిరంతరం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పుడు బయటకు వచ్చిన గణాంకాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో జియో స్టార్ అనేక రికార్డులను సృష్టించింది. గతంలో డిస్నీ హాట్‌స్టార్ కూడా వీటిని సాధించలేకపోయింది. ఈ రికార్డుల గురించిన సమాచారాన్ని జియోస్టార్ CEO స్వయంగా లింక్డ్ఇన్ ద్వారా అందించారు. జియోస్టార్ ఎలాంటి గణాంకాలను నమోదు చేసిందో చూద్దాం.

ఇది కూడా చదవండి: Financial Planning: స్కీమ్‌ అంటే ఇది కదా మావ.. రూ.12 లక్షల పెట్టుబడితో రూ.3.60 కోట్లు పొందే ఛాన్స్‌!

ఇటీవల జరిగిన ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా జియో హాట్‌స్టార్ 5.4 బిలియన్లకు పైగా వ్యూస్‌ను నమోదు చేసింది. జియో హాట్‌స్టార్ వీక్షకులు దాదాపు 11,000 కోట్ల నిమిషాలు ఛాంపియన్స్ ట్రోఫీని వీక్షించి రికార్డు సృష్టించారు. 2025 ఐసిసి పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ ప్రయాణం ఎలా ఉంది అని జియో హాట్‌స్టార్ డిజిటల్ సీఈఓ కిరణ్ మణి లింక్డ్ఇన్‌లో పోస్ట్‌లో అన్నారు. దీనిని 5.4 బిలియన్లకు పైగా వీక్షించారు. 11 బిలియన్ నిమిషాల పాటు వీక్షించారు. ఒకేసారి గరిష్టంగా 61.2 మిలియన్ల మంది వీక్షించారు. ఈ గణాంకాలు భారతదేశంలో డిజిటల్ స్ట్రీమింగ్ స్థాయి, అభిరుచి, పెరుగుదల శక్తివంతమైనదిగా చెప్పుకొచ్చారు.

ఫైనల్ మ్యాచ్‌ని ఎంత మంది చూశారు?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో 124.2 కోట్ల సార్లు వీక్షించారు. ఈ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ 61.2 మిలియన్ల వీక్షకులతో కొత్త రికార్డును సృష్టించింది. ప్రత్యక్ష క్రీడా ప్రసారంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అంతకుముందు 2023 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా డిస్నీ హాట్‌స్టార్ రూ. 5.9 కోట్ల రికార్డును సృష్టించింది.

ఎవరికి వాటా ఎంత ఉంది?

జియో స్టార్‌లో ముఖేష్ అంబానీ, అతని సంస్థకు మెజారిటీ వాటా ఉంది. డేటా ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోస్టార్‌లో 63.16 శాతం వాటాను కలిగి ఉంది. అందులో 16.34 శాతం ప్రత్యక్ష వాటా, 46.82 శాతం వయాకామ్ 18 ద్వారా ఉంది. మరోవైపు ఈ జాయింట్ వెంచర్‌లో డిస్నీకి 36.84% వాటా ఉంది. కొత్త యూనిట్ అయిన జియోహాట్‌స్టార్, వయాకామ్18, స్టార్ ఇండియా ఆస్తులను కలిపి భారతదేశపు అతిపెద్ద టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా మారింది.

ఇది కూడా చదవండి: PAN card: మీకు కొత్త పాన్‌ కార్డ్‌ కావాలా..? కేవలం 10 నిమిషాల్లోనే.. ఎలాగంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us