
ప్రముఖ సోషల్ మీడియా సంస్ధ అయిన మెటా కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల కోసం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నవారికి మరిన్ని ఫీచర్లు అందుతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. స్టోరీలు, ప్రొఫైల్‌లు, చాట్‌లు, రియాక్షన్‌లు, పోస్ట్ ఇన్‌సైట్‌లపై మరింత నియంత్రణ కోరుకునే వినియోగదారులకు ఈ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు ఉపయోగపడనున్నాయి.
AI ఎక్కువగా వాడేవారు, క్రియేటర్స్, వ్యాపారాల కోసం మెటా వన్ అనే పేరుతో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లు ప్రస్తుతానికి మెటా వెరిఫైడ్ నుండి వేరుగా ఉన్నాయని, అయితే మెటా వెరిఫైడ్ ఇప్పటికీ వెరిఫికేషన్, నకిలీ గుర్తింపు నుండి రక్షణను అందిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లను తీసుకురానున్నారు. ఇక ఫేస్‌బుక్ ప్లస్ ధర నెలకు 3.99 డాలర్లుగా ఉంది. ఇక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ పేరుతో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. దీని ధర కూడా నెలకు 3.99 డాలర్లుగా నిర్ణయించింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.362గా ఉంది. ఇక వాట్సాప్ ప్లస్ ధర నెలకు 2.99 డాలర్లుగా ఉంది. అంటే నెలకు రూ. 271గా నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్త సబ్‌స్క్రిప్షన్ ప్రమాణాలతో పోలిస్తే ధర తక్కువగానే ఉంది. కానీ ఇప్పటికే చాలమంది నెట్‌ఫ్లిక్స్, మ్యూజిక్ యాప్‌లు, క్లౌడ్ స్టోరేజ్, ఫుడ్ డెలివరీ మెంబర్‌షిప్‌లు తీసుకుంటుండగా.. అలాంటివారికి ఇది మరో అదనపు భారంగా చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి మరిన్ని స్టోరీ, ప్రొఫైల్ నియంత్రణలను అందిస్తోంది. ఒక స్టోరీని ఎంతమంది తిరిగి చూశారనేది తెలుసుకోవచ్చు. ఇక అన్ లిమిటెడ్ ఆడియన్స్ లిస్టులతో పాటు వారి స్టోరీ వీక్షకుల జాబితాను సెర్చ్ చేయవచ్చు. ఇక స్టోరీలను 24 గంటలకు మంచి పొడిగించుకోవచ్చు. ఇక వారానికి ఒకసారి స్టోరీని స్పాట్ లైట్ చేయొచ్చు. ఇక మెటా వన్ ప్లస్ ప్లాన్ ధర నెలకు 7.99 డాలర్లుగా ఉంది. అంటే సుమారుగా రూ.725గా చెప్పవచ్చు. అలాగే మెటా వన్ ప్రీమియం ధర నెలకు 19.99 డాలర్లుగా ఉంది. అంటే సుమారుగా రూ.1,814గా కొనసాగుతోంది. ఈ ప్లాన్ తీసుకున్నవారికి మెటా యాప్‌లలో లోతైన రీజనింగ్, మరిన్ని ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేయడం వంటి ఫీచర్లు ఉంటాయి. సాధారణ వినియోగదారులకు మెటా ఏఐ ఉచితంగానే ఉంటుంది. మరింత క్లిష్టమైన ప్రశ్నలు అడిగే లేదా ఏఐ సాధనాల ద్వారా ఎక్కువ మీడియాను సృష్టించే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ చెల్లింపు ప్లాన్‌లు తీసుకొచ్చింది.