ఎలాన్ మస్క్ ట్వీట్‌తో బిట్ కాయిన్‌ పరుగులకు బ్రేకులు.. నెట్టింట్లో ఆడుకుంటున్న నెటిజన్లు..

|

May 13, 2021 | 8:01 PM

Elon Musk Tweet Affects: టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ చేసిన ఒకే ఒక్క ట్వీట్‌ ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌పై తీవ్ర ప్రభావం పడింది. టెస్లా కార్లను కొనుగోలుకు బిట్‌కాయిన్‌ను అనుమతిస్తామని గతంలో చెప్పిన మస్క్‌.. తాజాగా తన నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు.

ఎలాన్ మస్క్ ట్వీట్‌తో బిట్ కాయిన్‌ పరుగులకు బ్రేకులు.. నెట్టింట్లో ఆడుకుంటున్న నెటిజన్లు..
Elon Musk Tweet Affects
Follow us on

టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ చేసిన ఒకే ఒక్క ట్వీట్‌ ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌పై తీవ్ర ప్రభావం పడింది. టెస్లా కార్లను కొనుగోలుకు బిట్‌కాయిన్‌ను అనుమతిస్తామని గతంలో చెప్పిన మస్క్‌.. తాజాగా తన నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు. సదరు క్రిప్టోకరెన్సీని ఇకపై తన కార్ల కంపెనీ కొనుగోలుకు వినియోగించేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పాడు. ఈ సమాచారాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. బిట్‌కాయిన్‌ వల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని కలుగుతోందని… శిలాజ ఇంధనాలు అధికంగా వినియోగించడం ఇందుకు కారణమని మస్క్‌ తన ఖాతాలో ట్వీట్ చేశాడు. అందుకే ఇక ముందు బిట్‌కాయిన్‌ను టెస్లా కార్ల కొనుగోలుకు తీసుకోమని పేర్కొన్నాడు.

మస్క్‌ ప్రకటనలతో ఒక్కసారిగా బిట్‌కాయిన్‌ విలువ పడిపోయింది. దాదాపు 15 శాతం క్షీణించి 56 వేల డాలర్ల నుంచి ఒక్కసారిగా 46వేల డాలర్లకు పడిపోయింది. ఇక్కసారిగా ఎలాన్ మస్క్ నుంచి ఇలాంటి ట్వీట్ చూసిన క్రిప్టో పెట్టుబడిదారులు షాక్‌ అయ్యారు.

ఎలాన్ మస్క్ ట్వీటపై ఒక్కసారిగా సోషల్ మీడియాలో సందడి మొదలైంది.  మీమ్స్‌, ట్రోల్స్‌ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు. గతంలో ఇదే మస్క్‌ బిట్‌కాయిన్‌ను ప్రోత్సహించడం వల్లే దాని విలువ 20 వేల డాలర్ల నుంచి 60వేలకు చేరింది. అప్పుడు అమాంతం పెరిగిన బిట్ కాయిన్ ఇప్పుడు పడిపోవడంతో నెట్టింట్లో సరదా పోస్టులు పెరిగిపోయాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మస్క్‌ నిర్ణయాలపై బిట్‌కాయిన్‌ విలువ ఆధారపడి ఉందంటూ మీమ్స్‌ పెడుతున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం మస్క్ చేసిన ట్వీట్‌పై మండిపడుతున్నారు. ఇప్పుడే మస్క్‌కు పర్యావరణం గురించి గుర్తొచ్చిందా అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌, టెస్లా కార్ల వల్ల పర్యావరణానికి హాని జరగడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Corona Antibodies: కొవిడ్‌ విజేతల్లో 8 నెలల పాటు యాంటీబాడీలు.. తాజా ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

ఇండియ‌న్ రైల్వే ఇంటిగ్ర‌ల్ కోచ్ ఫ్యాక్ట‌రీలో పారామెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

ఇర్ఫాన్ పఠాన్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌.. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం..