Term life insurance: బీమా పాలసీలతో బోలెడు ప్రయోజనాలు.. జెన్ జెడ్ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..!

|

Nov 28, 2024 | 4:15 PM

జీవితంలో అనుకోని ఆపద ఎదురైనప్పుడు బీమా (ఇన్స్యూరెన్స్) రక్షణ కల్పిస్తుంది. కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుతుంది. అనేక ఆర్థిక పరమైన అంశాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలి.

Term life insurance: బీమా పాలసీలతో బోలెడు ప్రయోజనాలు.. జెన్ జెడ్ తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..!
Insurance
Follow us on

సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడు ఎలాంటి అనారోగ్యాలు మన దరికి చేరవు. కొంచెం వయసు మీదపడిన తర్వాత దాడి చేస్తాయి. ఆ సమయంలో ఆస్పత్రిలో ఖర్చులకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఇలాంటి వాటి నుంచి బీమా భరోసా కల్పిస్తుంది. దేశంలో ప్రస్తుతం జనరేషన్ జెడ్ హవా నడుస్తోంది. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారికే జెన్ జెడ్ అని పిలుస్తారు. ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్ రంగాలలో వీరు పెట్టే ఖర్చు చూస్తే మతిపోవాల్సిందే. మన దేశంలో ఏటా ప్రజలు పెడుతున్న ఖర్చులో 43 శాతం వీరిదే. ఈ జెనరేషన్ యువత బీమా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఒక భద్రతా వలయంలా పనిచేస్తుంది. అనుకోని ఆపద ఎదురైనప్పుడు కుటుంబాన్ని రక్షిస్తుంది. హోమ్ లోన్లు, వ్యక్తిగత రుణాలు, బకాయిలను తీర్చుతుంది. అలాగే అద్దె, కిరాణా, యుటిలిటీ బిల్లులను చెల్లిస్తుంది. ఆర్థిక ఒత్తిడి లేకుండా పిల్లల చదువు, పెట్టుబడులు, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి సాయం పడుతుంది. ఉరుకుల పరుగుల జీవితం, కాలుష్యం, పని ఒత్తిడి తదితర కారణాలతో నేడు చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. టర్మ్ జీవిత బీమా ఆరోగ్య సంబంధ మరణాల నుంచి ఆర్థిక రక్షణ అందిస్తుంది. అలాగే వైద్య ఖర్చులను కవర్ చేయడానికి సాయపడుతుంది.  చిన్న వయసులో బీమా తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియం పడుతుంది. తక్కువ ఖర్చుతోనే బీమా కవరేజీ లభిస్తుంది. జెనరేషన్ జెడ్ కేటగిరీ యువత ఈ సమయంలో బీమా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

సాధారణంగా జెన్ జెడ్ యువత రుణాలు, క్రెడిట్ కార్డులు, హోసింగ్ రుణాలు తీసుకుని ఉంటారు. అనుకోకుండా మరణం సంభవిస్తే వారిపై ఆధార పడిన కుటుంబానికి వీటి చెల్లింపులు భారంగా మారతాయి. టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల ఈ రుణాలన్నీ తీర్చే అవకాశం ఉంటుంది. కుటుంబపై ఆర్థిక ఒత్తిడి ఉండదు.  కంపెనీ యజమానులు తమ ఉద్యోగులకు సమూహ జీవిత బీమా అందిస్తారు. దాని వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత అవసరాలను తీర్చలేకపోవచ్చు. మీరు ఆ కంపెనీలో ఉద్యోగం మానేసినప్పుడు ఇక వర్తించదు. కాబట్టి వ్యక్తిగత బీమా పాలసీ తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.  దేశంలో ఆన్ లైన్ ఇన్స్యూరెన్స్ ప్రొవైడర్లు పెరిగారు. డైరెక్ట్ టు కన్స్యూమర్ (డీ2సీ) విధానంలో పాలసీలను తీసుకునే అవకాశం ఉంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్టుగా బీమా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కుటుంబ పోషణకు మీరే కీలకమైతే, మీ ఆదాయంతోనే గడిచే పరిస్థితి ఉంటే తప్పకుండా బీమా తీసుకోవాలి. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మీ కుటుంబానికి అండగా నిలుస్తుంది. వారికి ఆర్థిక ఒత్తిడి లేకుండా చూస్తుంది. ఇన్స్యూరెన్స్ పాలసీ ప్రీమియాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏడాదికి రూ.1.50 లక్షల వరకూ తగ్గింపును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే బీమా దారుడికి లభించే మరణ ప్రయోజనం కూడా పన్ను రహితంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి