Best two wheelers: లేెటెస్ట్ బైక్స్ కోసం చూస్తున్నారా..? ఈ నెలలో విడుదలైన బెస్ట్ టూ వీలర్స్ ఇవే..!

|

Dec 31, 2024 | 11:04 AM

నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలందరూ సిద్దమవుతున్నారు. ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ఇలా ఆత్మీయులతో కలిసి సందడి చేయనున్నారు. కొత్త ఏడాది అందరూ సరికొత్త బైక్స్ కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో రిలీజయ్యే బైక్స్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

Best two wheelers: లేెటెస్ట్ బైక్స్ కోసం చూస్తున్నారా..? ఈ నెలలో విడుదలైన బెస్ట్ టూ వీలర్స్ ఇవే..!
Bike On Road (Representative image)
Follow us on

కొత్త ఏడాదిలో బైక్ లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే ఎలాంటి బైక్ ఎంపిక చేసుకోవాలా అనే సందేహం కలుగుతుంది. అలాంటి వారి కోసం అనేక లేటెస్ట్ ఫీచర్లతో కూడిన బైక్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. 125 సీసీ నుంచి 650 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ బైక్ ల ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

హోండా యాక్టివా 125

హోండా కంపెనీ అప్ డేట్ చేసిన యాక్టివా 125 మోడల్ మార్కెట్ లోకి విడుదలైంది. దీనికి ధర రూ.94,922. ఓబీడీ2బీ ప్రమాణాలతో పాటు, బ్లూటూత్ కనెక్టివిటీ గల 4.2 అంగుళాల టీఎఫ్ టీ డాష్ బోర్డు, వివిధ రకాల స్టార్ట్ ఫీచర్లతో రూపొందించారు. దీనిలోని 123.92 సీసీ ఇంజిన్ నుంచి 8.3 బీహెచ్పీ శక్తి ఉత్పత్తి అవుతుంది. నావిగేషన్, కాల్ అలర్ట్, మెసేజ్ అలర్ట్, యూఎస్ బీ టైప్ సీ చార్జింగ్ పోర్టు తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఐకానిక్ డిజైన్ తో ఆకట్టుకునే హోండా యాక్టివా ఆధునిక సాంకేతికతతో రైడర్లకు మంచి ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది.

కేటీఎం ఆర్సీ 125

లేటెస్ట్ అప్ డేట్ లతో విడుదలైన కేటీఎం ఆర్సీ 125 బైక్ రూ.1,81,913కు అందుబాటులో ఉంది. దీనిలో సుమారు 14 కొత్త అప్ డేట్లు చేశారు. ఎడ్జస్ట్ బుల్ హ్యాండిల్ బార్లు, కొత్త ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 13.7 లీటర్ల ట్యాంకు, తేలికైన స్ప్లిట్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్, బెస్ట్ టెయిల్ లైట్ డిజైన్, కర్వ్డ్ రేడియేటర్ ఆకట్టుకుంటున్నాయి. , కొత్త బ్రేక్ లు, తేలికపాటి చక్రాలు, ఫ్రంట్ బ్లింకర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ పొజిషన్ ల్యాంపు అదనపు ప్రత్యేకత. ఈ బైక్ బుక్కింగ్ లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల నాటికి షోరూమ్ లకు బైక్ చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

హోండా యూనికార్న్

హోండా కంపెనీ నుంచి లేటెస్ట్ యూనికార్న్ విడుదలైంది. ఆధునిక ఫీచర్లు, ఓబీడీ2బీ ప్రమాణాలను అనుగుణంగా ఈ బైక్ ను అప్ డేట్ చేశారు. దీనిలోని 162.71 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 13 బీహెచ్పీ, 14.58 ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది. ఇంజిన్ కు 5 స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు. యూఎస్బీ టైప్ సి చార్జింగ్ పోర్టు, క్రోమ్ ఎలిమెంట్స్ తో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఆధునిక డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. మూడు క్లాసిక్ రంగులలో అందుబాటులో ఉన్నఅప్ డేెటెడ్ హోండా యూనికార్న్ ధర రూ.1,19,481.

కవాసకి జెడ్65 ఓఆర్ఎస్

కవాసకి జెడ్65 ఓఆర్ఎస్ మోటారు సైకిల్ లోని 649 సీసీ సమాంతర ట్విన్ ఇంజిన్ నుంచి 67 బీహెచ్పీ, 64 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. టియర్ డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్, డ్యూయల్ అనలాగ్ గేజ్, ఆకట్టుకునే టెయిల్ దీని ప్రత్యేకతలు. కఠినమైన రోడ్లపై కూడా సునాయాసంగా పరుగులు తీస్తుంది. కొత్త ఎబోని కలర్ స్కీమ్ తో క్లాసిక్ లుక్ తో అదరగొడుతోంది. ఈ బైక్ రూ.7.20 లక్షలకు అందుబాటులో ఉంది.

కవాసకి కేఎల్ఎక్స్ 230

ఆఫ్ రోడ్ అడ్వెంచర్ల కోసం రూపొందించిన డ్యూయల్ స్టోర్ట్ మోటారు సైకిల్ ఇది. దీనిలో 233 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 18.1 బీహెచ్పీ, 18.3 ఎన్ఎం టార్క్ విడుదల అవుతాయి. హై మౌంటెడ్ మడ్ గార్డ్, ప్లాట్ సీట్, కాంపాక్ట్ 7.6 లీటర్ పెట్రోలు ట్యాంకు, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, స్విచ్ చేయదగిన ఏబీఎస్ తదితర ఫీచర్లు ఉన్నాయి. తేలికపాటి డిజైన్, అధిక సామర్థ్యం కలిగిన కవాసకి కేెఎల్ఎక్స్ 230 మైటారు సైకిల్ రూ.3.30 లక్షలకు అందుబాటులో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి