PF Deduction: మీ యజమాని మీ ఖాతాలో పీఎఫ్‌ జమ చేయడం లేదా? ఈ టిప్స్‌తో సమస్య పరిష్కారం

| Edited By: Ram Naramaneni

Nov 17, 2023 | 9:55 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌ పథకం అనేది నిర్దిష్ట పరిశ్రమలు, సంస్థల్లోని ఉద్యోగుల కోసం తప్పనిసరి కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఈ పథకం కింద యజమాని, ఉద్యోగి ఇద్దరూ ఈపీఎఫ్‌ ఖాతాకు నిధులు జమ చేస్తారు. అయితే ఈపీఎఫ్‌ ఖాతాలో పొదుపు చేసిన సొమ్మును ఉద్యోగికి పదవీ విరమణ సమయంలో లేదా ఇతర అవసరాల సమయంలో చెల్లిస్తారు.

PF Deduction: మీ యజమాని మీ ఖాతాలో పీఎఫ్‌ జమ చేయడం లేదా? ఈ టిప్స్‌తో సమస్య పరిష్కారం
EPFO
Follow us on

పదవీ విరమణ పొదుపులో ప్రావిడెంట్ ఫండ్ కీలకమైన భాగం. పీఎఫ్‌ డిపాజిట్లపై డిఫాల్ట్ చేయడం ద్వారా మీ యజమాని మీ ఆర్థిక భవిష్యత్తును ప్రమాదంలో పడవేయవచ్చు. నష్టాలు, వడ్డీని నివారించడానికి యజమానులు ఈపీఎఫ్‌ బకాయిలను సకాలంలో చెల్లించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కోరుతూనే ఉంది. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌ పథకం అనేది నిర్దిష్ట పరిశ్రమలు, సంస్థల్లోని ఉద్యోగుల కోసం తప్పనిసరి కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఈ పథకం కింద యజమాని, ఉద్యోగి ఇద్దరూ ఈపీఎఫ్‌ ఖాతాకు నిధులు జమ చేస్తారు. అయితే ఈపీఎఫ్‌ ఖాతాలో పొదుపు చేసిన సొమ్మును ఉద్యోగికి పదవీ విరమణ సమయంలో లేదా ఇతర అవసరాల సమయంలో చెల్లిస్తారు. అయితే ఒక్కో సమయంలో మన జీతం నుంచి యజమాని పీఎఫ్‌ కోసం నిధులు కట్‌ చేసుకున్నా. తిరిగి అతని వాటాతో కలిపి పీఫ్‌ ఖాతాకు నిధులు చెల్లించడంలో తాత్సారం చేస్తూ ఉంటారు. అయితే ఈ సమస్యను ఎలా నివేదించాలో? ఓ సారి తెలుసుకుందాం.

యజమాని ద్వారా పీఎఫ్‌ డిఫాల్ట్

ఈపీఎఫ్‌ఓ నిర్ణయించిన రేట్ల ప్రకారం కంట్రిబ్యూషన్‌లను డిఫాల్ట్ చేసే యజమానులు నష్టపరిహారం, చెల్లించాల్సిన మొత్తానికి వడ్డీని చెల్లించవలసి ఉంటుందని గమనించాలి. ఒక ఉద్యోగి తన పీఎఫ్‌ మొత్తాన్ని జీతం నుంచి తీసేసి వారి ఈపీఎఫ్‌ ఖాతాలో జమ చేయకపోతే ఈపీఎప్‌ఓ ఫిర్యాదు చేయవచ్చు.  ఇలా సమస్యను నివేదించడానిఇక మీ యజమాని మీ పీఎఫ్‌ సహకారాలను డిపాజిట్ చేయలేదని ధ్రువీకరించడం మొదటి దశ. మీరు ఈపీఎఫ్‌ఓ ​​మెంబర్ పోర్టల్ ద్వారా లేదా మీ పీఎఫ్‌ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా మీ పీఎఫ్‌ ఖాతా స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు.

ఈపీఎఫ్‌ఓకు చెల్లించాల్సిన నష్టాలు, వడ్డీ

కంట్రిబ్యూషన్‌లను డిఫాల్ట్ చేసే యజమానులు సెక్షన్ 14బీ కింద నష్టపరిహారం, చెల్లించాల్సిన మొత్తంపై సెక్షన్ 7 క్యూ కింద వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఇది రెండు నెలల కంటే తక్కువ ఉంటే సంవత్సరానికి ఐదు శాతం, 2-4 నెలల కాలానికి ఉంటే సంవత్సరానికి పది శాతం, 4-6 నెలలు ఉంటే సంవత్సరానికి 15 శాతం, 6 నెలల కంటే ఎక్కువ ఉండే సంవత్సరానికి 25 శాతం వడ్డీను చెల్లించాల్సి ఉంటుంది. నష్టపరిహారం బకాయి మొత్తంలో 100 శాతం వరకు పరిమితం చేశారు. మొత్తం వ్యవధి ఆలస్యానికి చెల్లించాల్సిన మొత్తానికి సంవత్సరానికి 12 శాతం సాధారణ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో ఫిర్యాదు

ఫిర్యాదును ఫైల్ చేయడానికి అత్యంత అనుకూలమైన మార్గం ఈపీఎఫ్‌ఐజీఎంఎస్‌ పోర్టల్. మీ యూఏఎన్‌, యజమాని ఏర్పాటు కోడ్, మీ ఫిర్యాదు స్వభావంతో సహా మీ వివరాలను అందించడం ద్వారా మీరు ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.

రాతపూర్వక ఫిర్యాదు

మీకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం రాకపోతే మీరు మీ పీఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయానికి రాతపూర్వక ఫిర్యాదును సమర్పించవచ్చు. ఫిర్యాదు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌కు పంపాలి.అలాగే మీ వివరాలు, యజమానికు సంబంధించిన వివరాలు, ఫిర్యాదు స్వభావం, సహాయక సాక్ష్యాలతో రాత పూర్వక ఫిర్యాదు చేయవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..