AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఇండియా నుంచి నేరుగా ట్రైన్లో నేపాల్ వెళ్లొచ్చు.. కొత్త రైలు వచ్చేస్తోంది.. రూట్ ఫిక్స్..

భారత్, నేపాల్ సరిహద్దులను కలుపుతూ కొత్త రైలు సర్వీస్ త్వరలో ప్రారంభం కానుంది. అయోధ్య, జనక్‌పూర్ థామ్ మధ్య వీక్లీ ట్రైన్‌కు రైల్వేశాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం షెడ్యూల్ వివరాలు ప్రకటించగా.. ఇంకా ప్రారంభ తేదీని వెల్లడించనుంది. త్వరలోనే ఈ సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశముంది.

Indian Railways: ఇండియా నుంచి నేరుగా ట్రైన్లో నేపాల్ వెళ్లొచ్చు.. కొత్త రైలు వచ్చేస్తోంది.. రూట్ ఫిక్స్..
Indian Railway
Venkatrao Lella
|

Updated on: Nov 14, 2026 | 6:48 PM

Share

ఇకపై ఇండియా నుంచి నేపాల్‌కి ఈజీగా ట్రైన్లో వెళ్లొచ్చు. యూపీలోని అయోధ్య నుంచి రైలు ద్వారా నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌కు చేరుకోవచ్చు. ఈ మేరకు భారతీయ రైల్వే కొత్త రైలు సర్వీస్‌కు ఆమోదం తెలిపింది. ఈ రూట్లో వీక్లీ ట్రైన్‌ను నడపనుండగా.. ఇది వారానికి ఒకసారి సర్వీసులు అందించనుంది. బీహార్, యూపీలోని ముఖ్యమైన పట్టణాలు, నగరాలను ఇది కవర్ చేస్తూ నేపాల్ వెళ్లనుంది. ఈ రైలు వల్ల జనక్‌పూర్ ధామ్‌, అయోధ్య మధ్య మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 604 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కవర్ చేయనుందని రైల్వేశాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

నేపాల్ వెళ్లే ట్రైన్ షెడ్యూల్ ఇదిగో..

ఈ రైలు జనక్‌పూర్ ధామ్ నుండి శనివారం బయల్దేరనుండగా.. అయోధ్య కంటోన్మెంట్ నుండి సోమవారం పయనమయవుతుందని రైల్వేశాఖ తెలిపింది. ఈ రైలు జయనగర్, మధుబని, శిషో, సీతామర్హి, రక్సౌల్, నార్కటియాగంజ్, గోరఖ్‌పూర్, బస్తీ, మంకపూర్, అయోధ్య ధామ్‌లలో వాణిజ్యపరమైన స్టాప్‌లలో ఆగనుంది. వారానికి ఒకసారి మాత్రమే ఇది నడుస్తుంది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రయాణికులు, పర్యాటకులకు ఈ రైలు ఉపయోగపడనుందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. జనక్‌పూర్, అయోధ్యలోని ప్రముఖ దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలను సందర్శించేందుకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. పర్యాటక ప్రదేశాలే కాకుండా విద్య, వ్యాపారం, కుటుంబ పరంగా ప్రయాణాలు చేసేవారికి రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని చెప్పవచ్చు.

సీతామాత జన్మించిన ప్రదేశానికి నేరుగా వెళ్లొచ్చు..

భారత్, నేపాల్ దేశాలు శతాబ్దాలుగా సాంస్కృతిక, చారిత్రక, సామాజిక బంధాలను పంచుకుంటున్నాయి. మతపరమైన సంప్రదాయాలు, సరిహద్దు సమాజ సంబంధాలు ఈ భాగస్వామ్యంలో అంతర్భాగంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య కనెక్టివిటీని పెంచడమే కాకుండా ద్వైపాక్షిక సహకారానికి కూడా ఈ రైలు సర్వీస్ ఉపయోగపడనుంది. సరిహద్దుల మధ్య అనుసంధానం, మతపరమైన పర్యాటకం, రెండు దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేయయడంలో ఇది కీలక అడుగుగా చెప్పవచ్చు. ఈ రైలు సర్వీస్‌కు సంబంధించి రైల్వేశాఖ నవంబర్ 14న అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే ప్రారంభించే అవకాశముంది. రామాయణ సంప్రదాయంతో ఈ రెండు ప్రదేశాలు ముడిపడి ఉన్నాయి. సీత జన్మించిన స్థలంగా జనక్‌పూర్ ధామ్‌ ప్రసిద్ది పొందగా.. శ్రీరాముడి జన్మస్థలంగా అయోధ్య ఉంది. ఈ రెండు ప్రముఖ ప్రదేశాల మధ్య అనుసంధానాన్ని కల్పించేందుకు ఈ రైలు తీసుకొచ్చినట్లు రైల్వేశాఖ పేర్కొంది. నేేపాల్‌లో సీతామాత జన్మించిన ప్రదేశాన్ని చూసేందుకు వెళ్లేవారికి ఇది ఉపయోగపడనుంది.

Follow Us