సోలార్ ఎనర్జీ కోసం సోలార్ ఫలకాలు అవసరం. వీటిని ఇళ్లపైనా, ఎండ తగిలే ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. వీటిని విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జింజవచ్చు. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఈ వ్యాపారం ఎలా చేయాలి, రుణం పొందే విధానం, రిజిస్టేషన్ చేసుకోవడం తదితర వివరాలను తెలుసుకుందాం. సోలార్ ప్యానెళ్ల వ్యాపారంలోకి వచ్చే ముందు దానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలి. పెట్టుబడి, ముడి పదార్థాలు, మార్కెటింగ్, విక్రయం, వాటిని ఏర్పాటు చేయడంపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవాలి. అలాగే ఎక్కడ వ్యాపారం నిర్వహించాలో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం.
సోలార్ ప్యానెళ్లను విక్రయించేవారు ముందుగా కంపెనీలా నమోదు చేసుకోవాలి. అప్పుడే మీరు చట్టబద్ధంగా వ్యాపారం చేయగలుగుతారు. కంపెనీల చట్టం 2013 ప్రకారం.. యాజమాన్యం, ఎల్ఎల్పీ, భాగస్వామ్యం, ఏకైక ప్రైవేటు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పన్ను ప్రయోజనాల కోసం యజమాని గుర్తింపు సంఖ్య (ఈఐఎన్) పొందాలి. ఏదైనా స్థలంలో దుకాణం లేదా కంపెనీ తెరవడానికి ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటితో పాటు వ్యాపార బీమాను కూడా తీసుకోవాలి. సోలార్ ప్యానెళ్ల వ్యాపారం కోసం దాదాపు రూ.40 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. వివిధ బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు వీటిని అందజేస్తాయి. వడ్డీరేటు కూడా 8 నుంచి 14 శాతం మధ్యలో ఉంటుంది. ప్రతినెలా ఈఎంఐల రూపంలో చాలా సులభంగా చెల్లించవచ్చు. దాదాపు 60 నెలల పాటు కాల వ్యవధి కూడా ఉంటుంది.
సోలార్ ప్యానెళ్ల వ్యాపారం చేయాలనుకునేవారికి ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన పథకంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీని కింద సోలార్ ప్యానెళ్ల ఖర్చులో దాదాపు 40 శాతం సబ్సిడీ లభిస్తుంది. సుమారు 1.50 లక్షలకు మూడు కిలోవాట్ల సబ్సిడీని పొందుతారు. దాదాపు రూ.70 వేల వరకూ తగ్గింపు రూపంలో ప్రయోజనం కలుగుతుంది. రుణం తీసుకునేందుకు ఈ పత్రాలు చాలా అవసరం. జీఎస్టీ నమోదు, కంపెనీ లేదా ఎల్ఎల్పీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కంపెనీ పాన్, బ్యాంకు ఖాతా సంఖ్య, సేల్స్ ట్యాక్స్, టిన్ నంబర్, ప్రారంభ ధ్రువీకరణ పత్రం, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏవోఏ), మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ (ఎంవోఏ), షాప్, ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం లైసెన్సు దగ్గర ఉంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి