Telugu News Business How much fuel does car AC consume per hour? Understanding the impact on mileage
Car AC: కారు ఏసీతో ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది? గంటకు ఎన్ని లీటర్లో తెలిస్తే షాక్ అవుతారు!
Car AC: సమ్మర్ సీజన్‌లోనే కాకుండా ఇతర కాలాల్లో చాలా మంది కారులో ఏసీని వినియోగిస్తుంటారు. అయితే ఏసీ వాడటం వల్ల ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుందోనని మీరెప్పుడైనా ఆలోచించారా? అలాగే నిలిపి ఉంచిన కారులో కూడా ఏసీ వాడుతుంటారు. అలాంటి సమయంలో ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Car AC: ప్రస్తుత ఎండలకు కారులో ఏసీ లేకుండా ప్రయాణం చేయడం దాదాపు అసాధ్యం. అయితే, ఏసీ ఆన్ చేయడం వల్ల మైలేజీ తగ్గుతుందని మనందరికీ తెలుసు. కానీ, అసలు ఒక గంట పాటు ఏసీ వాడితే ఎన్ని లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుంది? అనే విషయంలో చాలా మందికి అవగాహన ఉండదు. టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం.
పెద్ద కార్లు (2.0L అంతకంటే ఎక్కువ): వీటిలో ఏసీ కోసం గంటకు 0.5 నుండి 0.7 లీటర్ల వరకు పెట్రోల్ ఖర్చయ్యే అవకాశం ఉంది.
ఇంధన వినియోగం ఎప్పుడు పెరుగుతుంది?
కారు ఆపి ఏసీ వేయడం: కారు ప్రయాణంలో ఉన్నప్పటి కంటే, ఒకే చోట ఆపి ఏసీ వేసినప్పుడు ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఏసీ సెట్టింగ్స్: ఏసీని అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు కంప్రెసర్ ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. తద్వారా పెట్రోల్ వాడకం పెరుగుతుంది.
ట్రాఫిక్ జామ్: ట్రాఫిక్‌లో నెమ్మదిగా వెళ్తున్నప్పుడు ఇంజిన్‌పై లోడ్ పెరిగి ఏసీ వల్ల మైలేజీ బాగా తగ్గుతుంది.
కారు కండిషన్: పాత ఇంజిన్ లేదా సర్వీసింగ్ సరిగ్గా లేని ఏసీ సిస్టమ్ ఉన్నా పెట్రోల్ ఎక్కువగా ఖాళీ అవుతుంది.
పెట్రోల్ ఆదా చేయడానికి చిట్కాలు:
నీడలో పార్కింగ్: కారును ఎప్పుడూ నీడలో పార్క్ చేయడం వల్ల లోపల వేడి తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఏసీ త్వరగా క్యాబిన్‌ను చల్లబరుస్తుంది.
విండోస్ ఓపెన్ చేయడం: ప్రయాణం మొదలుపెట్టే ముందు కాసేపు విండోస్ తెరిచి ఉంచితే వేడి గాలి బయటకు పోతుంది. ఆ తర్వాత ఏసీ వేస్తే కంప్రెసర్‌పై ఒత్తిడి తగ్గుతుంది.
టైర్ ప్రెజర్: టైర్లలో గాలి తక్కువగా ఉంటే ఇంజిన్‌పై భారం పడుతుంది. అందుకే గాలిని ఎప్పుడూ సరిగ్గా ఉంచుకోవాలి.
స్థిరమైన వేగం: కారును ఒకే వేగంతో నడపడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది.
అత్యవసరమైతే తప్ప ఏసీని ఒకేచోట ఆపి వాడకపోవడమే మీ జేబుకు, కారు ఆరోగ్యానికి మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.