AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? మారిన రూల్స్.. ఇకపై ఇవ్వాల్సిన పనే లేదు..

యూఐడీఏఐ అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. మీరు హోటల్‌కి వెళ్లినప్పుడు ఆధార్ ఒరిజినల్ చూపించడం లేదా జిరాక్స్ ఇవ్వడం లాంటివి అక్కర్లేదు. ఇలా ఇవ్వడం వల్ల మీ వివరాలకు గొప్యత ఉండదు. మోసగాళ్లకు దొరికితే దుర్వినియోగం అవుతాయి. దీనికి చెక్ పెట్టేందుకు క్యూఆర్ ఆధారిత వెరిఫికేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది.

Aadhaar Card: హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? మారిన రూల్స్.. ఇకపై ఇవ్వాల్సిన పనే లేదు..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Aug 26, 2026 | 9:27 PM

Share

మీరు ఏదైనా ప్రాంతానికి వెళితే అక్కడ బస చేసేందుకు హోటల్‌కు వెళుతుంటారు. నేరుగా వెళ్లడం లేదా ముందుగానే యాప్స్ ద్వారా బుక్ చేసుకుని వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అనేక హోటల్ ఆన్‌లైన్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే హోటల్‌లో చెక్ ఇన్ అవ్వడానికి ఆధార్ కార్డు అడుగుతుంటారు. ఎవరిదైనా ఒకరిది ఆధార్ అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒకరి కంటే ఎక్కువమంది ఆధార్ కార్డులు కూడా అడగవచ్చు. ఇప్పటివరకు ఆధార్ జిరాక్స్ కాపీలను హోటల్‌లో తీసుకునేవారు. అయితే ఇక నుంచి అలాంటి అవసరం లేదు. హోటల్ చెక్ ఇన్ రూల్స్ పూర్తిగా మారుతున్నాయి. ఫిజికల్ కాపీల అవసరం లేకుండా ధృవీకరణ కోసం డిజిటల్ వ్యవస్థను తీసుకొస్తున్నారు.

క్యూఆర్ కోడ్ ద్వారా ధృవీకరణ పూర్తి

ప్రస్తుతం ఆధార్ కార్డు జిరాక్స్ అవసరం లేకుండా క్యూఆర్ కోడ్, ఓటీపీ ధృవీకరణ ద్వారా వెరిఫికేషన్ పూర్తవుతుంది. జిరాక్స్ కాపీలను అందించడం ద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీని వల్ల వినియోగదారుడి సమాచారానికి భద్రత ఉండటం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా ధృవీకరణ వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది. ఇక నుంచి జిరాక్స్ కాపీలను కూడా సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఇటీవల యూఐడీఏఐ కూడా సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీ అందించకుండానే క్యూఆర్ కోడ్ ద్వారా ఆధార్ ధృవీకరణ పూర్తి చేయవచ్చు. డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించేందుకు యూఐడీఏఐ కృషి చేస్తోంది. అందులో భాగంగా గుర్తింపు ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేస్తోంది.

డిజిటల్ చెన్ ఇన్

డిజిటల్ హోటల్ చెక్-ఇన్ ప్రక్రియలు గోప్యతను కూడా కాపాడతాయి. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది. అలాగే హోటల్ చెక్-ఇన్ సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఆధార్ జిరాక్స్ ఇవ్వడం  ద్వారా అది మోసగాళ్ల చేతికి చిక్కితే దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. మన ఆధార్ వివరాలు, జిరాక్స్‌లతో ఏదైనా మోసానికి పాల్పడవచ్చు. దీంతో యూఐడీఏఐ  ఇటీవల తెచ్చిన యాప్‌లో క్యూఆర్ కోడ్ ఆధారిత వెరిఫికేషన్ ఫీచర్ తీసుకొచ్చింది. అంతేాకాకుండా మీరు ఏ వివరాలు అయితే షేర్ చేయాలనుకుంటున్నారో వాటిని మాత్రమే పంచుకోవచ్చు.

Follow Us
హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..
హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..
తెలుగబ్బాయ్ తోపాటు రీఎంట్రీకి సిద్ధమైన మరో ముగ్గురు..!
తెలుగబ్బాయ్ తోపాటు రీఎంట్రీకి సిద్ధమైన మరో ముగ్గురు..!
కంప్యూటర్‌పై టేబుల్‌పై అందంగా ఏదో కదులుతూ కనిపించింది..!
కంప్యూటర్‌పై టేబుల్‌పై అందంగా ఏదో కదులుతూ కనిపించింది..!
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?