AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాడిన దానికంటే ఎక్కవ కరెంటు బిల్లు వస్తుందా? అసలు కారణం ఇదే.. ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా చెక్‌ పెట్టండి!

హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా చాలా ఇళ్లలో కరెంట్ వాడకం తక్కువగా ఉన్నా బిల్లులు మాత్రం భారీగా వస్తున్నాయి. ఇలా మీ ఇంట్లో కూడా జరుగుతుంటే మీటర్ తప్పు అని అసహనం వ్యక్తం చేయకండి, అసలు సమస్య వేరే ఉంది. అదేంటో తెలియాలన్నా, దానికి పరిష్కారం తెలుసుకోవాలన్నా..ఈ స్టోరీ చదవాల్సిందే!

వాడిన దానికంటే ఎక్కవ కరెంటు బిల్లు వస్తుందా? అసలు కారణం ఇదే.. ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా చెక్‌ పెట్టండి!
High Electricity Bill Reasons
Sukumaar DG - Associate Editor
| Edited By: |

Updated on: Sep 13, 2026 | 7:38 AM

Share

సాధారణంగా ప్రతి ఇంట్లో విద్యుత్ మీటర్లు పక్కాగా పనిచేస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో ఏర్పాటు చేస్తున్న డిజిటల్ మీటర్లు చాలా సున్నితంగా ఉంటున్నాయి. వీటిలో ఏ చిన్న తేడా వచ్చినా రీడింగ్ వేగంగా మారిపోతూ ఉంటుంది. మీ ఇంట్లోని వైరింగ్ వ్యవస్థలో ఉండే ఎర్త్ వైర్ లోపం వల్లే ఈ ప్రధాన సమస్య తలెత్తుతుంది. దీన్ని సకాలంలో గుర్తించకపోతే ప్రతి నెలా మీ జేబుకు చిల్లు పడటం ఖాయం.

న్యూట్రల్ లోపం – భూమిలోకి విద్యుత్ లీకేజీ

వైరింగ్ చేసే సమయంలో న్యూట్రల్ వైర్ సరిగ్గా పనిచేయకపోతే కరెంట్ నేరుగా ఎర్త్ వైర్ ద్వారా భూమిలోకి వెళ్లిపోతుంది. ఇలా లీక్ అవుతున్న విద్యుత్ ను కూడా మీరు వాడుతున్న కరెంట్ గానే మీటర్ రికార్డ్ చేస్తుంది. దీంతో మీరు ఫ్యాన్లు, లైట్లు వాడకపోయినా మీటర్ రీడింగ్ మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. కరెంట్ ఆదా చేస్తున్నాం కదా అని మీరు భావించినా బిల్లు మాత్రం ఏమాత్రం తగ్గదు.

న్యూట్రల్ లూపింగ్ – రెట్టింపు వేగంతో రీడింగ్

కొన్నిసార్లు ఎలక్ట్రీషియన్లు చేసే చిన్న తప్పుల వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. వైరింగ్ లాగే సమయంలో న్యూట్రల్ వైర్లు, ఎర్త్ వైర్లు ఒకదానితో ఒకటి కలిసినా సమస్యే. ఇలా తప్పుగా కలవడం వల్ల షార్ట్ సర్క్యూట్ కావడమే కాకుండా మీటర్ డిజిట్స్ రెట్టింపు వేగంతో పరుగెడతాయి. ఈ న్యూట్రల్ లూపింగ్ కారణంగా ఏమాత్రం విద్యుత్ వాడకపోయినా మీటర్ దానంతట అదే తిరుగుతూనే ఉంటుంది.

వృథా విద్యుత్‌తో వినియోగదారుడిపైనే భారం

ఇలా భూమిలోకి వృథాగా పోతున్న ప్రతి కరెంట్ బొట్టుకు మీరే పూర్తి స్థాయిలో బిల్లు కట్టాల్సి వస్తుంది. విద్యుత్ సంస్థలు ఈ నష్టాన్ని భరించవు కాబట్టి ఆ భారం వినియోగదారుడి పైనే పడుతుంది. నెల నెలా వస్తున్న ఈ అదనపు బిల్లు చూసి మీటర్ల లోపం అని విద్యుత్ అధికారులతో వాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అసలు సమస్యను గుర్తించడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం.

మీటర్ ఇండికేటర్లతో ఎర్త్ లీకేజీ గుర్తింపు

మీ ఇంట్లో ఈ లోపం ఉందో లేదో తెలుసుకోవడానికి ఓ చిన్న పరీక్ష చేస్తే సరిపోతుంది. మీ ఇంటి బయట ఉన్న కరెంట్ మీటర్ బోర్డుపై ఇఎల్(Earth leakage) అని రాసి ఉన్న లైట్ వెలుగుతుందో లేదో జాగ్రత్తగా గమనించండి. ఇఎల్ అంటే ఎర్త్ లీకేజ్ అని అర్థం, ఆ లైట్ వెలుగుతూ కనిపిస్తే కచ్చితంగా కరెంట్ లీక్ అవుతున్నట్లే లెక్క. అలాగే న్యూట్రల్ ఫాల్ట్ లైట్ ఆన్ లో ఉన్నా ప్రమాద ఘంటికలు మోగినట్లే భావించాలి.

మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి లోపాన్ని పసిగట్టే పద్ధతి

ఇంతకంటే సులభమైన మరో పద్ధతి ద్వారా కూడా ఈ వైరింగ్ లోపాన్ని పసిగట్టవచ్చు. మీ ఇంట్లోని మెయిన్ స్విచ్ లేదా ఎంసీబీని పూర్తిగా ఆఫ్ చేసి బయటకు వెళ్లి మీటర్ చూడండి. ఇంట్లో ఎలాంటి కరెంట్ వాడకం లేకపోయినా మీటర్ రీడింగ్ మారుతున్నా లేదా రెడ్ లైట్ బ్లింక్ అవుతున్నా మీ వైరింగ్ లో తేడా ఉన్నట్లే. ఈ చిన్న చిట్కాతో మీటర్ వేగంగా తిరగడానికి గల అసలు కారణాన్ని మీరు ఇట్టే కనిపెట్టేయవచ్చు.

మెగ్గర్ టెస్ట్ ద్వారా పరిష్కారం

ఇలాంటి సమస్య ఉన్నట్లు మీరు గుర్తిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచి అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ ను పిలిపించి వైరింగ్ ను పూర్తిగా చెక్ చేయించాలి. మెగ్గర్ టెస్ట్ చేయించడం ద్వారా న్యూట్రల్ అలాగే ఎర్త్ వైర్ల మధ్య ఉన్న లీకేజీలను కచ్చితంగా గుర్తించవచ్చు. వెంటనే ఆ లోపాలను సరిచేయించుకుంటే మీ కరెంట్ బిల్లుల బాధ శాశ్వతంగా తీరిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us