SUV vs MUV vs XUV vs TUV: ఈ పేర్లు వినే ఉంటారు.. కానీ వాటి అర్థాలు తెలుసా? వాటి మధ్య తేడాలేంటి?

|

Mar 14, 2024 | 6:53 AM

కార్లలో చాలా రకాలుంటాయి. మీరు ఈ నాలుగు చక్రాల వాహనాలను ఎక్కువ ఇష్టపడేవారైతే వాటిల్లో రకాలపై ఒక అవగాహన ఉండే ఉంటుంది. ఎస్‌యూవీ(SUV), ఎంయూవీ(MUV), ఎక్స్‌యూవీ(XUV), టీయూవీ(TUV) విభాగాలుగా కార్లు ఉంటాయి. ఇటీవల కాలంలో ఎస్‌యూవీలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. చాలా మందికి వీటి పేర్లు అయితే ఐడియా ఉంటుంది కానీ.. అసలు పూర్తి పేర్లు ఏంటి? వాటి మధ్య తేడాలు ఏంటి అన్న విషయంలో చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది.

SUV vs MUV vs XUV vs TUV: ఈ పేర్లు వినే ఉంటారు.. కానీ వాటి అర్థాలు తెలుసా? వాటి మధ్య తేడాలేంటి?
Suv, Xuv, Muv, Tuv Cars
Follow us on

కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా అనంతర పరిణామాల్లో అందరూ కారు ప్రయాణాలకు అలవాటు పడ్డారు. లాంగ్ టూర్లు అయినా, ఫ్యామిలీతో వెళ్లే టూర్లు అయినా, బంధువుల ఇంటికి కుటుంబాలుగా వెళ్లాలన్నా అందరూ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో సొంతకార్లు కలిగి ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే కార్లలో చాలా రకాలుంటాయి. మీరు ఈ నాలుగు చక్రాల వాహనాలను ఎక్కువ ఇష్టపడేవారైతే వాటిల్లో రకాలపై ఒక అవగాహన ఉండే ఉంటుంది. ఎస్‌యూవీ(SUV), ఎంయూవీ(MUV), ఎక్స్‌యూవీ(XUV), టీయూవీ(TUV) విభాగాలుగా కార్లు ఉంటాయి. ఇటీవల కాలంలో ఎస్‌యూవీలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. చాలా మందికి వీటి పేర్లు అయితే ఐడియా ఉంటుంది కానీ.. అసలు పూర్తి పేర్లు ఏంటి? వాటి మధ్య తేడాలు ఏంటి అన్న విషయంలో చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. వీటి గురించి అడిగినప్పుడు చాలా మంది గందరగోళానికి సైతం గురవుతుంటారు. ఈ క్రమంలో ఎస్‌యూవీ, ఎంయూవీ, ఎక్స్‌యూవీ, టీయూవీలు అంటే ఏమిటి? వాటి మధ్య ప్రధాన తేడాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎస్‌యూవీ అంటే ఏమిటి?

ఎస్‌యూవీ పూర్తి స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్. ఇవి శక్తివంతమైన పనితీరును అందించే ఇంజిన్‌లతో కూడిన కార్లు. వాటి లోపల కూడా చాలా ఎక్కువ స్థలం ఉంటుంది. ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కి సరిగ్గా సరిపోతాయి. అయితే ఈ ఎస్‌యూవీలు కూడా వివిధ పరిమాణాలలో వస్తాయి. ఉదాహరణకు, ఫార్చ్యూనర్ వంటి కార్లను ఫుల్ సైజ్ ఎస్‌యూవీలు అంటారు. అదే సమయంలో మారుతి బ్రెజ్జా ఒక సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ, హ్యూందాయ్ క్రెటా అనేది మిండ్ రేంజ్ ఎస్‌యూవీగా పరిగణిస్తారు.

ఎంయూవీ అంటే ఏమిటి?

ఎంయూవీ అంటే పూర్తి పేరు మల్టీ యుటిలిటీ వెహికల్స్. దీనిని పేరును బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కారు అనేక రకాల సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఈకారులో ఎక్కువ మంది ప్రయాణించే వీలుంటుంది. అదే సమయంలో, ఎక్కువ సామాను లేదా బరువు కూడా ఈ కార్లలో పెట్టుకునేందుకు స్థలం ఉంటుంది. ఆన్-రోడ్ పనితీరు చాలా బాగుంది. అయితే ఆఫ్-రోడ్ పనితీరు మాత్రం ఎస్యూవీ కన్నా తక్కువగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎక్స్‌యూవీ అంటే ఏమిటి?

ఎక్స్‌యూవీ అంటే పూర్తి రూపం క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్. పైన పేర్కొన్న ఎస్యూవీ, ఎంయూవీ రెండింటిని కలిపితే ఈ ఎక్స్‌యూవీ అవుతుంది. ఈ కార్లు అద్భుతమైన పనితీరుతో పాటు ఎంయూవీ వలే స్థలం పుష్కలంగా వస్తుంది. ఇది ఆఫ్-రోడ్లలో కూడా సులభంగా నడపవచ్చు. మహీందా ఎక్స్‌యూవీ సిరీస్ భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన ఎక్స్‌యూవీ కార్లు. వీటిలో మహీంద్రా ఎక్స్‌యూవీ300, మహీంద్రా ఎక్స్‌యూవీ500, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటివి ఉన్నాయి.

టీయూవీ అంటే ఏమిటి?

టీయూవీ అంటే పూర్తి రూపం టఫ్ యుటిలిటీ వెహికల్స్. ఫీచర్లలో ఈ కార్లు ఎస్యూవీ కార్ల మాదిరిగానే ఉంటాయి. కానీ అవి ఎస్యూవీల కంటే కొంచెం చిన్నవి. వీటిని మినీ స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు అంటే మినీ ఎస్యూవీలుగా కూడా పిలుస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..