Gratuity Calculator: మీకు గ్రాట్యూటీ ఎంత వస్తుందో మీరే లెక్కించండి! సాలరీ ఎంటర్‌ చేస్తే చాలు.. ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు!

మీరు PF ఖాతాదారులా? అయితే EPF, EPS పెన్షన్, గ్రాట్యుటీ వంటి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యోగులకు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సేవ తర్వాత కంపెనీ అందించే బోనస్ గ్రాట్యుటీ. గ్రాట్యుటీని ఎలా లెక్కించాలి, దాని ఫార్ములా, అర్హతలు వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Gratuity Calculator: మీకు గ్రాట్యూటీ ఎంత వస్తుందో మీరే లెక్కించండి! సాలరీ ఎంటర్‌ చేస్తే చాలు.. ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు!
Gratuity Calculation

Updated on: Feb 03, 2026 | 9:15 PM

మీరు ఒక సంస్థలో పనిచేస్తూ PF ఖాతా కలిగి ఉంటే, మీరు EPF నుండి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మీరు పని చేస్తున్నంత కాలం PF ఖాతాలో సాలరీ నుంచి కొంత మొత్తం జమ అవుతూ ఉంటుంది. మీ అవసరానికి అనుగుణంగా మీరు దాని నుండి డబ్బును విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత మీరు దాని నుండి పూర్తిగా ప్రయోజనం పొందవచ్చు. PF ఖాతా ఉన్నవారు వారి సర్వీస్ ప్రకారం పదవీ విరమణ తర్వాత EPS పెన్షన్ కూడా పొందుతారు. అలాగే ఉద్యోగులు గ్రాట్యుటీని పొందుతారు. మీరు కంపెనీలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసి తరువాత దానిని వదిలిపెట్టినా లేదా పదవీ విరమణ చేసినా మీరు ఈ గ్రాట్యుటీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి? దీన్ని ఎలా లెక్కించాలి? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గ్రాట్యుటీ

గ్రాట్యుటీ అనేది 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతర సేవ తర్వాత, ఉద్యోగం నుండి నిష్క్రమించినప్పుడు లేదా పదవీ విరమణ చేసిన తర్వాత కంపెనీ ఇచ్చే బోనస్. ఈ గ్రాట్యుటీ సాధారణంగా ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సేవ పూర్తి చేసిన వారికి మాత్రమే ఇస్తారు. ఈ చెల్లింపు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 ప్రకారం ఇస్తారు. ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా వైకల్యం సంభవించినప్పుడు ఉద్యోగులు ముందస్తు గ్రాట్యుటీని పొందవచ్చు. ఈ మొత్తం వారు చివరిగా అందుకున్న జీతం, సేవ చేసిన సంవత్సరాల ఆధారంగా ఉంటుంది.

గ్రాట్యుటీ కాలిక్యులేటర్

ఐదు సంవత్సరాల నిరంతర సేవ తర్వాత మీరు కంపెనీని విడిచిపెట్టినప్పుడు మీరు ఎంత పొందుతారో గ్రాట్యుటీ కాలిక్యులేటర్ అంచనా వేస్తుంది. తక్షణ గ్రాట్యుటీ సంఖ్యను పొందడానికి మీ చివరి జీతం, మొత్తం సర్వీస్ కాలాన్ని నమోదు చేయండి.

గ్రాట్యుటీని లెక్కించడానికి ఫార్ములా

గ్రాట్యుటీ చట్టం కింద ఉన్న ఉద్యోగుల కోసం ఒక ఫార్ములా ఉపయోగించి గ్రాట్యుటీని లెక్కిస్తారు. దీని కోసం మీరు ఒకే కంపెనీలో కనీసం ఐదు సంవత్సరాలు పని చేయాలి. మీరు అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే, మీకు గ్రాట్యుటీ ఇస్తారు. ప్రతి సంవత్సరం పనికి మీకు 15 రోజుల జీతానికి సమానమైన మొత్తం ఇస్తారు. మీరు సంవత్సరంలో 6 నెలల కంటే ఎక్కువ పనిచేసినా, అది ఒక సంవత్సరంగా లెక్కిస్తారు. అంటే మీరు ఐదు సంవత్సరాల 6 నెలలు పనిచేసినా అది ఆరు సంవత్సరాలుగా పరిగణిస్తారు. గ్రాట్యుటీకి సూత్రం (నెలవారీ జీతం x 15 x సేవా కాలం) / 26 (పని దినాలు). ఇక్కడ 15 రోజులు అంటే 15 రోజుల జీతం, 26 అంటే నెలలో 26 పని దినాలు. ప్రాథమిక జీతం పైన నెలవారీ జీతం యాడ్‌ అవుతుంది. ఇప్పుడు రూ.30,000 బేసిక్ జీతంతో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీకు ఎంత గ్రాట్యుటీ లభిస్తుందో ఫార్ములా తెలుసుకుందాం.

5 సంవత్సరాల సర్వీస్‌తో..

5 సంవత్సరాల సర్వీస్ కు మూల జీతం రూ.30 వేలు గ్రాట్యుటీ = (30000x15x5)/26 = 86538.46. ఈ లెక్క ప్రకారం 7 సంవత్సరాల సర్వీస్ కు గ్రాట్యుటీ రూ.1,21,153.84. 10 సంవత్సరాల సర్వీస్ కు గ్రాట్యుటీ రూ.173076.92. అదేవిధంగా మీరు మీ సర్వీస్ వ్యవధి ప్రకారం మీ జీతాన్ని లెక్కించవచ్చు. మీరు 15 సంవత్సరాలు పనిచేసి చివరి జీతం రూ.30,000 అయితే గ్రాట్యుటీ = (15 x 30000 x 15) / 26 = రూ.2,59,615 వస్తుంది. గరిష్ట గ్రాట్యుటీ మొత్తం రూ.20 లక్షలు. ఏదైనా అదనపు మొత్తం ఎక్స్-గ్రేషియాగా పరిగణిస్తారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి