Good News for Farmers-Dairy Farm Loans: వ్యవసాయమైనా, వ్యాపారమైనా ప్రజల అవసరాలను, వారి డిమాండ్స్ ను దృష్టిలో పెట్టుకుని వాటికీ అనుగుణంగా తమ మార్కెట్ పరిధిని పెంచుకుంటే లాభాల బాట పడతారు. లేదంటే.. ఏదైనా సరే.. పండగ కాదు దండగ ని నిట్టుర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలానుగుణంగా.. మనిషికి కావాల్సిన వాటిని దృష్టిలో పెట్టుకుని చేస్తే ఏ వ్యాపారమైనా సరే..మూడు పువ్వులు ఆరు కాయలు అన్నచందంగా ఉంటుంది. అలాంటి లాభసాటి వ్యవసాయ వ్యాపారాల్లో ఒకటి పశువుల పెంపకం.. నష్టాలు చాలా తక్కువ.
పశుసంవర్ధక, పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. వాటికీ అనుగుణంగా రుణాలు ఇస్తూ.. రైతులను ప్రోత్సహిస్తున్నాయి. రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో పాల వ్యవస్థాపక అభివృద్ధి పథకాన్ని నడుపుతోంది. ఈ పథకం కింద పశువుల రైతులు 10 గేదెలను కలిగి ఉన్న పాడి పరిశ్రమను ప్రారంభించడానికి పశువుల శాఖ నుండి రూ .7 లక్షల వరకు రుణం పొందవచ్చు.
ఈ పథకంలో ఋణం తీసుకునే మహిళలకు 33% సబ్సిడీ లభిస్తుంది. అదే ఎస్సీ కేటగిరీ మహిళలైట్ ఋణంపై మరింత రాయతీలు ఇవ్వనున్నారు. ఇక జనరల్ కేటగిరీ డెయిరీ యజమానికి 25 శాతం, మహిళలకు, ఎస్సీ తరగతికి 33 శాతం సబ్సిడీ కూడా ఇస్తారు. నష్టాలు తక్కువగా ఉండే పశువుల పెంపకం ఖరీదైన వ్యాపారం.. దీంతో పెట్టుబడి పెట్టడానికి రైతులు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వంతో నిర్వహించడుతున్న నాబార్డ్ సంస్థ.. రైతులకు, పాడి వ్యవస్థాపకులకు లబ్ది చేకూరేలా ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. పల్లె ప్రజలకు ఉపాధిని కల్పించడం పాల ఉత్పత్తిని పెంపెందించడం.. ఈ పథకం భారత ప్రభుత్వం 2010 సెప్టెంబర్ 1 నుండి ప్రారంభించింది.
డెయిరీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ స్కీమ్ :
ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. పాడి రంగంలో స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం. ఈ పథకాన్ని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) అమలు చేస్తోంది
పథకం యొక్క ప్రయోజనాలు:
ఈ పథకం కింద, పశుసంవర్ధకాన్ని కోరుకునే వ్యక్తికి మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 33.33 శాతం వరకు సబ్సిడీ ఇచ్చే నిబంధన ఉంది. అయితే ఎవరైతే పశువుల పెంపకంపై ఆసక్తితో ఉన్నాడో అతను వ్యయంలో కనీసం 10 శాతం స్వయంగా పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 90 శాతం ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కింద ఇచ్చే సబ్సిడీ బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ అవుతుంది. దీని కింద, ‘నాబార్డ్’ ఇచ్చిన సబ్సిడీ రుణం తీసుకున్న చోట నుండి అదే బ్యాంకు ఖాతాలోకి జయమవుతుంది. అనంతరం రుణం ఇచ్చిన వ్యక్తి పేరిట జమ చేసిన డబ్బును బ్యాంక్ ఉంచుతుంది.
ఈ పతాకంపై ఆసక్తి కలిగిన రైతులు నేరుగా వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకులను సంప్రదించవచ్చు. లేదా నాబార్థుని కూడా సంప్రదించవచ్చు. అయితే ఈ పథకం లో తీసుకునే ఋణం లక్ష కంటే ఎక్కువ ఉంటె ఋణం తీసుకునే వ్యక్తి ఏమైనా ఆస్తికి చెందిన పత్రాలను షూరిటీగా పెట్టాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రాయితీ పొందేకేటగిరీ లబ్దిదారులైతే కాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ప్రాజెక్ట్ కు సంబందించిన వివరాలతో కూడిన పాత్రలను జత చేయాల్సి ఉంటుంది.
Also Read: Onion Oil: జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు సమస్యలకు ఒకటే పరిష్కారం.. ఈ నూనె అప్లై చేసి అద్భుతం ఫలితం పొందండి