Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడులేనంతగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది.

Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today

Updated on: Feb 09, 2023 | 6:26 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడులేనంతగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,550 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి రూ.71,400 లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,700గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,830, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,720
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,600
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,550
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,550 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,400 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.71,400
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000
  • బెంగళూరులో రూ.74,000
  • కేరళలో 74,400
  • కోల్‌కతాలో 71,400
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000
  • విజయవాడలో రూ.74,000
  • విశాఖపట్నంలో రూ.74,000 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us