AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: గోల్డెన్ న్యూస్.. చౌక.. చౌక.! బంగారం కొనాల్సిన టైం వచ్చేసింది.. తులం ఎంతంటే.?

చౌక.. చౌక.. గోల్డ్ రేట్స్ నేలచూపులు చూస్తున్నాయ్. గడిచిన నాలుగు రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల బట్టి.. సుమారు రూ. 18 వేల మేరకు గోల్డ్ రేట్ తగ్గింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Gold Price Today: గోల్డెన్ న్యూస్.. చౌక.. చౌక.! బంగారం కొనాల్సిన టైం వచ్చేసింది.. తులం ఎంతంటే.?
Ravi Kiran
|

Updated on: Aug 15, 2025 | 6:18 AM

Share

గోల్డ్ లవర్స్‌కి.. మరీ ముఖ్యంగా మహిళలకు ఎగిరి గంతేసే వార్త.. గత కొద్దిరోజులుగా బంగారం నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ట్రేడ్ వార్ దాదాపుగా ముగింపునకు రావడం.. అలాగే యూఎస్ ఎకనామిక్ డేటా , ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఫెడరల్ రిజర్వు రేట్ లాంటివి గోల్డ్ రేట్స్‌ను ప్రభావితం చేస్తున్నాయ్. గడిచిన నాలుగు రోజుల్లో 100 గ్రాముల ఏకంగా రూ. 18 వేల వరకు తగ్గింది. కృష్ణాష్టమి, వినాయక చవితి దగ్గర పడుతున్న తరుణంలో బంగారం కొనుగోలుదారులకు ఇది మంచి పరిణామం. ఇండిపెండెన్స్ డే సమయంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. అటు వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గడిచిన రెండుల్లో సిల్వర్ రేట్స్ కేజీకి రూ. 1100 మేరకు పెరిగాయి. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,01,490 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,040గా ఉంది. అటు ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,340 ఉండగా.. 22 క్యారెట్ల 10 గోల్డ్ ధర రూ. 92,890గా ఉంది. ఇక బెంగళూరు, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,340గా.. 22 క్యారెట్ల 10 గోల్డ్ ధర రూ. 92,890గా కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,01,340గా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,890గా ఉంది.

సిల్వర్ రేట్స్ ఇలా..

బంగారం ధరలు నేలచూపులు చూస్తుంటే.. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీపై వెండి ధర రూ. 1100 మేరకు పెరిగింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 1,16,100గా ఉంది. అలాగే హైదరాబాద్, కేరళ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,26,100గా కొనసాగుతోంది. కాగా, పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గోల్డ్ రేట్స్ కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇది చదవండి: తిరుగులేని వ్యాపారం.. ఎప్పటికీ తగ్గని డిమాండ్.. ఈ బిజినెస్‌తో ప్రతీ నెలా లక్షల్లో ఆదాయం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..