Gold Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం విలువ ఎంతంటే..

బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తోంది. నిన్న మన్నటి వరకూ ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఈమధ్య కాలంలో క్రమంగా క్షీణిస్తున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, హమాస్ యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Gold Price: స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం విలువ ఎంతంటే..
Gold Price Today

Updated on: Nov 29, 2023 | 6:26 AM

బంగారు ఆభరణాలే కాకుండా గోల్డ్ బిస్కెట్ రూపంలో కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడతారు. అయితే బంగారం ధర రోజుకో విధంగా మారుతూ వస్తోంది. నిన్న మన్నటి వరకూ ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఈమధ్య కాలంలో క్రమంగా క్షీణిస్తున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రదాన కారణం. దీంతో పాటూ ఇజ్రాయిల్, హమాస్ యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల తగ్గుదలకు కారణం అవుతోంది.

నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.62,560 కాగా ఈరోజు కూడా అదే ధరలో స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 57,350 ఉండగా ఈరోజు కూడా అలాగే కొనసాగుతోంది. అంటే ఈరోజు ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 81,500 కాగా ఈరోజు కూడా ఇదే ధర కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 62,560
విజయవాడ..రూ. 62,560
ముంబాయి..రూ. 62,560
బెంగళూరు..రూ.62,560
చెన్నై..రూ. 63,050

ఇవి కూడా చదవండి

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర

హైదరాబాద్..రూ. 57,350
విజయవాడ..రూ. 57,350
ముంబాయి..రూ. 57,350
బెంగళూరు..రూ. 57,350
చెన్నై..రూ.57,800

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

హైదరాబాద్..రూ. 81,500
విజయవాడ..రూ. 81,500
చెన్నై..రూ.81,500
ముంబాయి..రూ. 78,500
బెంగళూరు..రూ. 78,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us