సిగరెట్లు తాగేవారికి బాంబ్ పేల్చే న్యూస్.. మరోసారి భారీగా ధరల పెంపు.. స్మోకింగ్ ఇక ఖరీదే..
సిగరెట్లు తాగే వినియోగదారులకు పిడుగులాంటి వార్త. సిగరెట్ల ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఈ మేరకు ఐటీసీ నిర్ణయం తీసుకుంది. గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం సిగరెట్ల ధరలను పెంచింది. తాజాగా దీనికి సంబంధించి ప్రకటన చేసింది. దీంతో ఐటీసీ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి.

సిగరెట్లు తాగేవారికి బ్యాడ్‌న్యూస్. దేశంలోని ప్రధాన సిగరెట్ తయారీ సంస్థ అయిన ఐటీసీ సిగరెట్ల వినియోగదారులకు పిడుగులాంటి వార్త అందించింది. సిగరెట్ల ధరలను ఈ ఏడాదిలో మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోల్డ్ ఫ్లాక్ ప్రీమియం సిగరెట్ల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ఐటీసీ ప్రకటించింది. పన్నుల భారం పెరగడంతో ధరలను పెంచుతున్నట్లు వెల్లడించగా.. ఈ నిర్ణయంతో సిగరెట్లు తాగేవారిపై మరింత భారం పడనుంది. దీని వల్ల సిగరెట్లు తాగేవారి జేబులకు చిల్లులు పడనున్నాయి. ఒక్కో ప్యాకెట్‌కు ఏకంగా పది రూపాయల అదనంగా పెంచింది. దీంతో గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం ప్యాకెట్ ధరలు భారీగా పెరిగాయి. ఈ పెంపు ప్రకటనతో ఐటీసీ షేర్ల ధరలు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ఐటీసీతో పాటు గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా షేర్లు కూడా లాభపడ్డాయి.
కొత్త ధరలు ఇవిగో..
-60 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు గల గోల్డ్ ఫ్లాగ్ ప్రీమియం రెగ్యులర్ సైజ్ ఫిల్టర్ టిప్డ్ సిగరెట్ల 10 ప్యాకెట్ ధర రూ.125 నుంచి రూ.135కి పెరిగింది. అంటే ఒక్క ప్యాకెట్‌పై దాదాపు 8 శాతం పెరిగింది.
-ఈ ఏడాది జూన్‌లో రూ.115 నుంచి రూ.125కి పెంచింది. ఇప్పుడు మరో రూ.10 పెంచింది. దీంతో ఈ ఏడాది మొత్తం 17.4 శాతం పెంచింది. ఈ ఏడాదిలో పెంచడం ఇది రెండోసారి
ధరల పెంపుకు ప్రధాన కారణాలివే.
ఐటీసీ ధరలను పెంచడానికి ప్రధాన కారణం పెరుగుతున్న పన్నుల భారంగా చెప్పవచ్చు. సిగరెట్లపై కేంద్రం విధించే పన్నులు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. ఇదే కాకుండా చట్టబద్ధంగా విక్రయించే సిగరెట్లకు, అక్రమంగా మార్కెట్‌లోకి వస్తున్న సిగరెట్లకు మధ్య ధరల వ్యత్యాసం భారీగా ఉంది. దీని వల్ల తక్కువ ధరకు లభించే అక్రమ సిగరెట్ల వైపు కొంతమంది వినియోగదారులు చూస్తున్నారు. దీంతో ఐటీసీ కూడా ధరలను పెంచుతూ వస్తోంది. ఐటీసీ వ్యాపారంలో గోల్డ్ ఫ్లాగ్ ప్రీమియం బ్రాండ్‌కు ఎక్కువ సేల్స్ ఉన్నాయి. కంపెనీ సిగరెట్ ఆదాయంలో ఈ విభాగం వాటా దాదాపు 50 శాతం ఉంది. అందుకే ఈ బ్రాండ్ ధరలో చేసే చిన్న మార్పు కూడా కంపెనీ ఆదాయంపై ప్రభావం చూపుతుంది. పన్నుల భారంతో పాటు అక్రమ మార్కెట్ పోటీ ఎదుర్కొవడం, వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం ఆధారంగా ఐటీసీ ధరల్లో మార్పులు చేస్తోంది. కేంద్రం పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని భారీగా పెంచింది. అలాగే ట్యాక్సులను కూడా భారీగా విధిస్తంది. ఈ ప్రభావం కంపెనీలపై పడుతుండగా.. కంపెనీలు కస్టమర్లకు భారాన్ని బదిలీ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో సిగరేట్ల ధరలు మరింత పెరిగే అకకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే సిగరెట్ తాగడం మరింత ఖరీదుగా మారనుందని చెప్పవచ్చు.
