Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

Gold And Silver Rates: గోల్డ్ ధర తగ్గేదేలే.. ఇటీవల కాలంలో బంగారం ధర ధరలు భగ్గుమన్న విషయం తెలిసిందే.. నాన్ స్టాప్‌గా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర.. సరికొత్త రికార్డులను నమోదు చేసింది.. ఏకంగా బంగారం 10 గ్రాముల ధర రూ.లక్షా ముప్పైవేలు దాటింది.. వెండి కిలో ధర కూడా దాదాపు రూ. 2లక్షల వరకు చేరి.. రికార్డులను తిరగరాసింది.

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

Updated on: Oct 30, 2025 | 11:04 AM

గోల్డ్ ధర తగ్గేదేలే.. ఇటీవల కాలంలో బంగారం ధరలు భగ్గుమన్న విషయం తెలిసిందే.. నాన్ స్టాప్‌గా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర.. సరికొత్త రికార్డులను నమోదు చేసింది.. ఏకంగా బంగారం 10 గ్రాముల ధర రూ.లక్షా ముప్పైవేలు దాటింది.. వెండి కిలో ధర కూడా దాదాపు రూ. 2లక్షల వరకు చేరి.. రికార్డులను తిరగరాసింది. అయితే.. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా కూడా బంగారం ధర తగ్గింది. లక్షా 25 వేలకు చేరువైంది.. అయితే.. గత ఐదు రోజుల నుంచి తగ్గిన బంగారం ధర.. శనివారం మళ్లీ పెరిగింది.. శనివారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.1,250 మేర ధర పెరిగింది.

కాగా.. తాజాగా బంగారం, వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. ఆదివారం (అక్టోబర్ 26 2025) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి..

  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,620 గా ఉంది.
  • 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు రూ.1,15,150 గా ఉంది.
  • వెండి కిలో రేటు రూ.1,55,000 లుగా ఉంది..

తెలుగు రాష్ట్రాల్లో, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,25,620 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.1,15,150 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,70,000 లుగా ఉంది.
  2. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.1,25,620, 22 క్యారెట్ల ధర రూ.1,15,150 గా ఉంది.. కిలో వెండి ధర రూ.1,70,000లుగా ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,25,770, 22 క్యారెట్లు రూ.1,15,300 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,55,000లుగా ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,25,620, 22 క్యారెట్లు రూ.1,15,150 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,55,000 లుగా ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,25,450, 22 క్యారెట్ల ధర రూ.1,15,000 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,70,000లుగా ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,25,620, 22 క్యారెట్ల ధర రూ.1,15,150 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,57,000లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..