Fact Check: జనవరి 1 నుంచి రూ.1000 నోట్ వస్తుందా? రూ.2000 నోట్లు రద్దు అవుతున్నాయా? ఇందులో నిజమెంత? ఇదిగో క్లారిటీ!

|

Dec 25, 2022 | 1:57 PM

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత ఇప్పుడు కొత్త సంవత్సరానికి ముందు 1000 రూపాయల నోటు, 2000 రూపాయల నోట్ల గురించి ఎన్నో..

Fact Check: జనవరి 1 నుంచి రూ.1000 నోట్ వస్తుందా? రూ.2000 నోట్లు రద్దు అవుతున్నాయా? ఇందులో నిజమెంత? ఇదిగో క్లారిటీ!
Indian Currency Notes
Follow us on

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత ఇప్పుడు కొత్త సంవత్సరానికి ముందు 1000 రూపాయల నోటు, 2000 రూపాయల నోట్ల గురించి ఎన్నో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా మరోసారి రూ.1000 నోట్లను ప్రారంభించబోతోందని, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా రకాల పోస్ట్‌లు వస్తున్నాయి. నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేస్తుంది. జనవరి 1 నుంచి 1000 రూపాయల కొత్త నోటు వస్తుందని ఆర్బీఐ తెలిపిందంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే 2 వేల రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చింది. నోట్ల ముద్రన నిలిచిపోయింది తప్ప రద్దు చేసే ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ విషయం పక్కనపెడితే.. జనవరి 1వ తేదీ నుంచి ఆర్బీఐ వెయ్యి రూపాయల నోటును విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియా వేదిక ద్వారా వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి వార్తలపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఇందులో నిజమెంత..?

ఈ మేరకు పీఐబీ అధికారిక ట్వీట్‌ చేసింది. జనవరి 1 నుంచి కొత్త రూ.1000 నోట్లు రానున్నాయని, రూ.2000 నోట్లు రద్దు అవుతాయని వైరల్‌ అవుతున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని, ఇలాంటి వార్తలు పూర్తిగా నకిలీవని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన అధికారిక ట్వీట్‌లో పేర్కొంది. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ అని, ఎవ్వరు కూడా నమ్మవద్దని సూచించింది. రూ.2000 నోట్లను రద్దు చేయడం, జనవరి 1 నుంచి కొత్తగా రూ.1000 నోటును తీసుకువచ్చే ఆలోచన లేదని, ఇవి నిజం కాదని పీఐబీ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదు:

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇలాంటి పోస్టులు పూర్తిగా నకిలీదని పీఐబీ గుర్తించింది. రిజర్వ్ బ్యాంక్ అలాంటి ప్లాన్ చేయలేదని, అలాగే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే ప్రణాళిక కూడా లేదని స్పష్టం చేసింది. అలాంటి పోస్ట్‌లను షేర్ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

 

వైరస్‌ న్యూస్‌పై సమాచారం అందించండి

మీరు వైరల్ సందేశాన్ని తనిఖీని కూడా చేయవచ్చు. మీకు కూడా అలాంటి సందేశం వచ్చినట్లయితే టెన్షన్‌ పడకండి. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను ఎవరితోనూ షేర్ చేయవద్దు. ఇది కాకుండా మీరు ఏదైనా వార్తల వాస్తవ తనిఖీని కూడా చేయవచ్చు. దీని కోసం మీరు అధికారిక లింక్ https://factcheck.pib.gov.in/ సందర్శించాలి. ఇది కాకుండా మీరు వాట్సాప్ నంబర్ +918799711259 లేదా ఇమెయిల్: pibfactcheck@gmail.com కి కూడా వీడియోను పంపవచ్చు. దీనిపై తనిఖీ నిర్వహించి వెంటనే క్లారిటీ ఇస్తామని పీఐబీ తెలిపింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి