ముఖ్యంగా రూ.500 నోట్లలో చాలా ఎక్కువ నకిలీవే ఉంటున్నాయి. ఇది ఎవరో అనామకుడు చెప్పిన విషయం కాదు. సాక్ష్యాత్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదికలో వెలుగులోకి వచ్చిన వాస్తవం. దాని ప్రకారం గత ఐదేళ్లలో రూ.500 నకిలీ నోట్లు 317 శాతం పెరిగాయి. నకిలీ నోట్ల కారణంగా అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా దేశ భద్రతకు భంగం వాటిల్లుతుంది. ద్రవ్వోల్బణం ఏర్పడి ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. వీటిని అరికట్టడం ప్రభుత్వాలకు పెద్ద సవాల్ గా మారింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 21,865 మిలియన్ల నకిలీ రూ.500 నోట్లను గుర్తించారు. వాటి సంఖ్య 2022-23 నాటికి 91,110 మిలియన్లకు పెరిగిపోయింది. అలాగే 2023-24 నాటికి 15 క్షీణత నమోదై 85,711 మిలియన్లకు చేరుకుంది. పార్టమెంట్ కు సమర్పించిన ఆర్థిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ముఖ్యంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో నకిలీ రూ.500 నోట్ల పెరుగుదల విపరీతంగా జరిగింది. 2020-21 లో 39,453 మిలియన్ల ఉన్న నోట్లు 79,669 మిలియన్లకు పెరిగిపోయాయి. అంటే దాదాపు 102 శాతం నమోదైంది. అలాగే 2023-24 లో నకిలీ రూ.2 వేల నోట్ల చెలామణి విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు 166 శాతం చెలామణిలోకి వచ్చాయి. మార్కెట్ లోకి నకిలీ నోట్ల రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొందరు అక్రమార్కులు వీటిని చెలామణి చేస్తూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. అసలు నోట్ల మాదిరిగా ఉంటున్న వీటిని గుర్తించడం చాలా కష్టం. ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకంగా మారిన నకిలీ నోట్లను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంకు అనేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా రూ.500 నోట్లను ముద్రించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంది. వాటికి నకిలీలు తయారు చేయలేని విధంగా రూపొందిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి