దీపావళి ఆఫర్: పాత బంగారానికి.. కొత్త బంగారం..! మరేమిటీ లాభం..?

| Edited By:

Oct 25, 2019 | 9:00 AM

దీపావళి పండుగ.. సందడి వచ్చేసింది. ఒక రెండు వారాల ముందు నుంచే పలు సంస్థల యజమానులు.. వినియోగదారులను ఆకర్షించడానికి.. పలు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. కానీ.. చాలా మంది.. దీపావళికి బంగారం కొంటూంటారు. అది వారి ఆనవాయితీ.. అంటారు. బంగారం రూపంలో.. లక్ష్మీ దేవిని ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచే జరుగుతుందని వారి అభిప్రాయం. ఇక అందులోనూ.. ఈ రోజు దంతేరాస్. దీంతో.. బంగారు షాప్ నిర్వాహకుల ఆఫర్లకు కొదువే లేదు. కొంతమంది గ్రాముల మీద ధరలు తగ్గిస్తామంటారు. […]

దీపావళి ఆఫర్: పాత బంగారానికి.. కొత్త బంగారం..! మరేమిటీ లాభం..?
Follow us on

దీపావళి పండుగ.. సందడి వచ్చేసింది. ఒక రెండు వారాల ముందు నుంచే పలు సంస్థల యజమానులు.. వినియోగదారులను ఆకర్షించడానికి.. పలు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. కానీ.. చాలా మంది.. దీపావళికి బంగారం కొంటూంటారు. అది వారి ఆనవాయితీ.. అంటారు. బంగారం రూపంలో.. లక్ష్మీ దేవిని ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచే జరుగుతుందని వారి అభిప్రాయం. ఇక అందులోనూ.. ఈ రోజు దంతేరాస్. దీంతో.. బంగారు షాప్ నిర్వాహకుల ఆఫర్లకు కొదువే లేదు. కొంతమంది గ్రాముల మీద ధరలు తగ్గిస్తామంటారు. మరికొందరు.. తరుగు, మజూరు ఫ్రీ అంటారు. అలాగే.. మీ పాత బంగారాన్ని తీసుకురండి.. కొత్తది తీసుకురండి అంటూ.. పలు ఆఫర్లు ఇస్తూ.. పసిడి ప్రియులను ఆకర్షిస్తున్నారు.

కాగా.. గత సంవత్సరం దీపావళి పండుగ సమయానికి 24 క్యారెట్ల, 10 గ్రాముల బంగారం ధర రూ.33,000లు ఉంది. అంటే గ్రాము రూ.3,000 అన్నమాట. మరి ఈ సంవత్సరం 24 క్యారెట్ల, 10 గ్రాముల బంగారం ధర రూ.39,000లకు పైగా ఉంది. గ్రాము వచ్చి దాదాపు 4 వేలుగా ఉంది. కాగా.. ప్రస్తుతం పసిడి ధర మరీ ఎక్కువగా ఉండటం, ఆర్థిక మందగమనంతో బంగారు షాపులు వెలవెల బోతున్నాయి. దీంతో.. బంగారు ప్రియులను ఆకర్షించేందుకు పాత బంగారం తెచ్చి.. అదే బరువుకు కొత్త బంగారం తీసుకెళ్లండంటూ.. ఆఫర్లు చేస్తున్నారు షాప్ నిర్వాహకులు. అయితే ఇదేదో.. ఆఫర్ బావుదంటూ.. వినియోగదారులు షాపులకు క్యూ కడుతున్నారు. కానీ.. అక్కడే వారు జాగ్రత్తగా వ్యవహరించాలన్న సంగతి మర్చిపోతున్నారు.

పాత బంగారం తీసుకుని.. కొత్త బంగారం ఇస్తే.. షాపు యజమానులకు ఏమిటి లాభం అనే సందేహం వచ్చిందా..? అదే.. అక్కడే ఉంది పసిడి షాపు నిర్వాహకుల చేతి వాటం. వారికి బంగారం మీద తరుగు, మజూరీ ఛార్జీల రూపంపలో లాభం వస్తుంది. ఆభరణాన్ని ముందుగా పరీక్ష చేసి.. విలువ లెక్కకడతారు. తరుగు కింద ఆభరణం డిజైన్‌కు అనుగుణంగా 4 నుంచి 30 శాతం వరకు ఉండనున్నట్లు, అత్యధిక ఆభరణాలకు 18 నుంచి 28 శాతం కింద తరుగు వేస్తారని తెలుస్తోంది. ఇది రూ.26 వేల నుంచి రూ.40 వేల దాకా ఉంటుందని అంచనా. ఇలాంటి విషయాల్లోనే.. పసిడి ప్రియులు ఆచితూచి వ్యవహరించడం మంచింది.