
Second-Hand AC: వేసవి కాలంలో ఏసీ కొందామనుకుంటే బడ్జెట్ అడ్డంకిగా ఉందా? అందుకే చాలామంది సెకండ్ హ్యాండ్ ఏసీల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే తక్కువ ధరకు వస్తోంది కదా అని కళ్ళు మూసుకుని కొంటే, తర్వాత రిపేర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. టెక్ నిపుణుల ప్రకారం..పాత ఏసీ కొనే ముందు మీరు తప్పనిసరిగా తనిఖీ చేయవలసిన 8 ముఖ్యమైన టిప్స్ ఇవే.
ఇది కూడా చదవండి: YouTube Channel: AI సాయంతో యూట్యూబ్ ఛానెల్.. ఈ ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్.. భారీ ఆదాయం!
ఏసీ ఎంత పాతదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా 5-7 ఏళ్ల కంటే ఎక్కువ కాలం వాడిన ఏసీలను కొనకపోవడమే మంచిదంటున్నారు టెక్ నిపుణులు.. ఏసీ పాతబడే కొద్దీ దాని పనితీరు తగ్గుతుంది. అలాగే విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
ఇండోర్ యూనిట్‌లోని కూలింగ్ కాయిల్స్‌ను జాగ్రత్తగా గమనించండి. కాయిల్స్‌పై తుప్పు (Corrosion) లేదా గ్యాస్ లీకేజీ ఆనవాళ్లు ఉన్నాయేమో చూడండి. కాయిల్స్ నీలం లేదా రాగి రంగులో శుభ్రంగా ఉంటేనే అది మంచి స్థితిలో ఉన్నట్లు లెక్క.
ఏసీకి కంప్రెసర్ గుండెకాయ వంటిది. ఏసీ ఆన్ చేసినప్పుడు కంప్రెసర్ నుండి అసాధారణమైన శబ్దాలు రాకూడదు. ఒకవేళ కంప్రెసర్ లోపభూయిష్టంగా ఉంటే, దానిని మార్చడం చాలా ఖర్చుతో కూడుకున్న పని.
గ్యాస్ తక్కువగా ఉంటే ఏసీ సరిగ్గా చల్లబరచదు. పైపుల దగ్గర నూనె మరకలు ఉంటే అక్కడ గ్యాస్ లీక్ అవుతోందని అర్థం. కొనే ముందే గ్యాస్ లెవల్స్ ఎలా ఉన్నాయో టెక్నీషియన్‌తో తనిఖీ చేయించడం ఉత్తమం.
మీరు ఏసీని ఎక్కువ గంటలు వాడాలనుకుంటే ‘ఇన్వర్టర్ ఏసీ’ని ఎంచుకోండి. ఇవి పాత మోడల్ నాన్-ఇన్వర్టర్ ఏసీల కంటే తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. మీ కరెంటు బిల్లు ఆదా అవ్వడానికి ఇది చాలా ముఖ్యం.
ఏసీ లోపల వైరింగ్ ఎక్కడైనా కాలిపోయిందా లేదా ఎలుకలు కొరికేశాయా అని చూడండి. సరిగ్గా లేని వైరింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఏసీని కనీసం 15-20 నిమిషాల పాటు ఆన్ చేసి ఉంచండి. ఇండోర్ లేదా అవుట్‌డోర్ యూనిట్ నుండి విపరీతమైన వైబ్రేషన్ లేదా శబ్దం వస్తుంటే, ఫ్యాన్ మోటార్ లేదా కంప్రెసర్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించాలి.
వీలైతే ఆ ఏసీకి సంబంధించిన సర్వీస్ రికార్డులను అడగండి. రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేయించిన ఏసీలు ఎక్కువ కాలం మన్నికగా పనిచేస్తాయి.
చివరి సలహా: సెకండ్ హ్యాండ్ ఏసీని కొనేటప్పుడు మీకు నమ్మకమైన ఏసీ మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. వారు కేవలం ఒక లుక్ వేసి ఏసీ కండిషన్‌ను ఇట్టే చెప్పేయగలరు. ఇలా చేయడం వల్ల మీ డబ్బు వృథా కాకుండా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?
ఇది కూడా చదవండి: Gas Cylinder: ఆవు పేడతో గ్యాస్ సిలిండర్.. 18కేజీల గ్యాస్ జస్ట్ రూ.500లకే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి