Zudio: జుడియో బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుందో తెలుసా? బిజినెస్‌ సీక్రెట్‌ ఇదే..!

జుడియో.. అత్యంత తక్కువ ధరలకే ఫ్యాషనబుల్ బట్టలు, యాక్సెసరీస్, కాస్మెటిక్స్ అందిస్తూ మిడిల్ క్లాస్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా నాణ్యమైన బట్టల ధరలు ఆకాశాన్నంటే ఈ రోజుల్లో జుడియో అంత తక్కువ ధరలకు దుస్తులను ఎలా అందించగలుగుతోందో తెలిపే ప్రధాన కారణాలు తెలుసుకుందాం..

Zudio: జుడియో బట్టలను అంత తక్కువ ధరలకు ఎలా ఇస్తుందో తెలుసా? బిజినెస్‌ సీక్రెట్‌ ఇదే..!
Zudio

Updated on: Aug 19, 2026 | 6:25 AM

Zudio Business strategy: నేటి ఫ్యాషన్ ప్రపంచంలో ‘జుడియో’ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాటా గ్రూప్‌నకు చెందిన ‘ట్రెండ్స్’ ప్లాట్‌ఫామ్‌లో భాగమైన జుడియో.. అత్యంత తక్కువ ధరలకే ఫ్యాషనబుల్ బట్టలు, యాక్సెసరీస్, కాస్మెటిక్స్ అందిస్తూ మిడిల్ క్లాస్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా నాణ్యమైన బట్టల ధరలు ఆకాశాన్నంటే ఈ రోజుల్లో జుడియో అంత తక్కువ ధరలకు దుస్తులను ఎలా అందించగలుగుతోందో తెలిపే ప్రధాన కారణాలు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి: Goat Farming: ఏ మేక జాతి ఎక్కువ ఆదాయం, పాలను ఇస్తుంది? ఈ మేకలతో కోటీశ్వరులు కావచ్చు..!

  1.  బల్క్ ప్రొడక్షన్ : జుడియో భారీ ఎత్తున (Bulk Quantity) ఆర్డర్లు ఇచ్చి దుస్తులను తయారీదారుల నుండి కొనుగోలు చేస్తుంది. ఒకేసారి లక్షల సంఖ్యలో ప్రొడక్షన్ జరగడం వల్ల తయారీ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని జుడియో నేరుగా కస్టమర్లకు అందిస్తుంది.
  2. జీరో అడ్వర్టైజింగ్: పెద్ద పెద్ద బ్రాండ్లు టీవీలు, హోర్డింగ్‌లు, సెలబ్రిటీలతో చేసే భారీ ప్రకటనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తాయి. కానీ జుడియో ప్రకటనల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. కేవలం వర్డ్-ఆఫ్-మౌత్ (ఒకరి నుంచి మరొకరికి ప్రచారం), సోషల్ మీడియా హైప్ ద్వారానే కస్టమర్లను ఆకర్షిస్తుంది. దీనివల్ల ప్రచార ఖర్చులు పూర్తిగా ఆదా అవుతాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. స్టోర్ డిజైన్, నో-ఫ్రిల్స్ కాన్సెప్ట్: జుడియో షోరూమ్‌లు సింపుల్, ఎఫిషియంట్ డిజైన్‌తో ఉంటాయి. షాపుల్లో అనవసరమైన హంగులు, ఖరీదైన డెకరేటివ్ ఇంటీరియర్లు ఉండవు. తక్కువ మంది సిబ్బందితోనే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇది నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గిస్తుంది.
  5. స్వదేశీ తయారీ: జుడియో తన ఉత్పత్తులను విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా భారత్‌లోనే ఉండే స్థానిక తయారీదారుల నుండి సేకరిస్తుంది. దీనివల్ల దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చులు బాగా తగ్గుతాయి.
  6. ఫాస్ట్ ఫ్యాషన్ ఇన్‌వెంటరీ మోడల్: ప్రతి వారం కొత్త కొత్త డిజైన్లను స్టోర్లలోకి తీసుకురావడం జుడియో ప్రత్యేకత. ఒక డిజైన్ లేదా స్టాక్ కొన్ని రోజుల్లోనే అమ్ముడవుతుంది. స్టాక్ నిల్వలు పెండింగ్‌లో పడిపోకపోవడం వల్ల స్టోరేజ్ ఖర్చులు, నష్టాలు ఉండవు.
  7. తక్కువ ప్రాఫిట్ మార్జిన్ – ఎక్కువ అమ్మకాలు: ఒక్కో వస్తువుపై ఎక్కువ లాభం (Profit Margin) ఆశించకుండా.. తక్కువ లాభంతో ఎక్కువ సంఖ్యలో ప్రొడక్ట్స్ అమ్మడమే జుడియో ప్రధాన బిజినెస్ స్ట్రాటజీ. దీనివల్ల కస్టమర్లకు చవకగా లభిస్తుంది. కంపెనీకి సేల్స్ ద్వారా మంచి లాభాలు వస్తాయి. టాటా బ్రాండ్ ఇచ్చే నాణ్యత నమ్మకం, వేగంగా మారే ట్రెండ్స్, సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయే ధరలే జుడియోను భారత రిటైల్ ఫ్యాషన్ మార్కెట్‌లో తిరుగులేని బ్రాండ్‌గా నిలిపాయి.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మరోసారి వరుస సెలవులు.. కారణం ఏంటంటే..!

ఇది కూడా చదవండి: Success Story: రూ.10 వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్లు.. వీటి సాగుతో రికార్డు సృష్టించిన అన్నదమ్ములు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us