క్రిప్టోకరెన్సీలపై దాడులు పెరుగుతాయనే భయంతో బిట్‌కాయిన్ విలువ గత వారం నుంచి 10శాతం వరకు పతనమైంది. ఒక పక్క ఫేస్‌బుక్ కూడా క్రిప్టో కరెన్సీలను ప్రారంభించ నుండటంతో చాలా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం నుంచి బిట్‌కాయిన్ 11.1శాతం కుంగి 9,855 డాలర్లకు చేరింది. ఒక్క ఆదివారం నాడే ఇది 10శాతానికి పైగా తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… బిట్ కాయిన్ సంస్థలు బ్యాంకుగా ఏర్పడాలంటే అమెరికా ప్రభుత్వం, ఇతర ప్రభుత్వాల రెగ్యూలేటరీలకు జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. ఈ అంశంపై ట్రంప్ ట్వీట్ చేసిన వెంటనే బిట్‌కాయిన్లు ఒత్తడికి గురైయ్యాయి. ఆ తర్వాత ఫెడ్ ఛైర్మన్ జోరమ్‌పావెల్ మరో ప్రకటన చేశారు. ఫేస్‌బుక్‌ను ఈ ప్రాజెక్టు ఆపమని కోరారు. దీంతో బిట్‌కాయిన్లు భారీగా పతనమయ్యాయి.
I am not a fan of Bitcoin and other Cryptocurrencies, which are not money, and whose value is highly volatile and based on thin air. Unregulated Crypto Assets can facilitate unlawful behavior, including drug trade and other illegal activity….
— Donald J. Trump (@realDonaldTrump) July 12, 2019