Banking Budget 2022: బడ్జెట్ 2022(Budget 2022) కోసం సన్నాహాలు పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్ ప్రభుత్వానికి, ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. CNBC ఆవాజ్ నివేదిక ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బ్యాంకింగ్ రంగానికి పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో జన్ ధన్ యోజన మూడో దశను ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉంది. దీని కింద, జన్ ధన్ ఖాతాదారులందరికీ డిజిటల్ బ్యాంకింగ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యంతో అనుసంధానించే ఛాన్స్ ఉంది. డిజిటల్ బ్యాంకింగ్ సేవను ప్రవేశపెట్టిన తర్వాత, జన్ ధన్(Jan Dhan Yojana) ఖాతాదారులు మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా పొందగలుగుతారు.
అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను జన్ ధన్ ఖాతాతో లింక్ చేయవచ్చని కూడా ఒక నివేదిక పేర్కొంది. జన్ ధన్ ఖాతా నుంచి కూడా ఈ పథకాలలో డిపాజిట్లు చేయవచ్చు. దీంతో ఈ పథకాల పరిధి మరింత పెరగనుంది.
44 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు..
జన్ ధన్ ఖాతాల కింద 44.33 కోట్ల ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాదారులను సుకన్య సమృద్ధి యోజనతో అనుసంధానం చేయడం ప్రభుత్వ ఉద్దేశం. జన్ ధన్ ఖాతాలు చాలా వరకు ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఓపెన్ చేశారు. ఈ బ్యాంకు ఖాతాల్లో 1 లక్షా 54 వేల 916 కోట్ల రూపాయలు జమ అయ్యాయి.
ఈ పథకం 2014లో ప్రారంభం..
ఈ పథకాన్ని 2014లో ప్రారంభించారు. దేశంలోని ప్రజలందరూ బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం అయ్యేలా జన్ ధన్ యోజన ప్రారంభించారు. PMJDY ఖాతాలో మినిమం బాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఈ ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డ్ జారీ చేశారు. ఇది కాకుండా, 2 లక్షల ప్రమాద బీమా కూడా అందిస్తున్నారు. ఈ అకౌంట్లకు రూ. 10,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉంది.
జన్ ధన్ ఖాతా తెరవడానికి కావాల్సిన పత్రాలు..
జన్ ధన్ ఖాతా తెరవడానికి KYC ప్రక్రియ చాలా సరళంగా ఉంది. కింది పత్రాలలో దేనినైనా సమర్పించిన తర్వాత మీరు SBI లేదా ఏదైనా ఇతర బ్యాంకులో జన్ ధన్ ఖాతాను తెరచే అవకాశం ఉంది.
పాస్ పోర్ట్
డ్రైవింగ్ లైసెన్స్
పాన్ కార్డ్
ఆధార్ కార్డ్
ఓటర్ గుర్తింపు కార్డు
ప్రభుత్వం ఆమోదించిన NREGA జాబ్ కార్డ్
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు
స్వీయ సంతకం లేదా బొటనవేలు ముద్రను కలిగి ఉన్న స్వీయ ధృవీకరణ ఫోటోతో ఒక లేఖతో కూడా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
Also Read: Budget 2022: బడ్జెట్ 2022లో హెల్త్‌కేర్ రంగం ఎలా ఉండనుంది.. మౌలిక వసతులు పెరిగేనా?
Budget 2022: బడ్జెట్‌పై బ్యాంకింగ్ రంగం భారీ ఆశలు.. ఆ విషయంలో ప్రత్యేక మినహాయింపుల కోసం ఎదురుచూపులు!